ఈ రోజుల్లో మనిషి డబ్బుకు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వడం లేదు.  డబ్బు కోసం తనపై పని వత్తిడి పెరిగినా..సర్ధుకొని చేసుకుని పోతున్నాడు. అంతే కాదు బంధు మిత్రులను కూడా దూరం చేసుకుంటున్నారు.  ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేవారు.  కానీ ఇప్పుడు తల్లిదండ్రులను కూడా చూడటాని చాలా ఇబ్బందులు పడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు.
Image result for indian family cartoon
 కానీ ఆ తల్లిదండ్రులు తమ కొడుకులను ప్రయోజవంతులుగా తీర్చి దిద్దడానికి ఎంతో శ్రమిస్తున్నారు.  ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు. చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.

Related image

డైరెక్టరు : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా?
యువకుడు: లేదండీ! మా అమ్మ-నాన్నగార్లె అన్ని ఫీజులు కట్టెవారు.......
డైరెక్టరు: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?
యువకుడు: ఖాళీ-సిసలు పాత-ఇనుము వెస్ట్-పేపర్ ప్లాసిటిక్-స్క్రాప్ చిన్న-చిన్న-వ్యాపారములు చేసి అదే పనిని వృ త్తిగా  మార్చుకొని నన్ను చదివించారు. 
డైరెక్టరు: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు.
యువకుడు: తన చేతులను చూపించాడు.
అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్త్తగా  ఉన్నాయి.
డైరెక్టరు: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో  సహాయపడ్డావా?
యువకుడు: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకునిమంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను.
డైరెక్టరు: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి.
డైరెక్టరు: నాదొక చిన్నవిన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను.
యువకుడు: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్.
డైరెక్టరు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులకు మూడు-రోజులు విరామము ఇచ్చి.....
వారు చేసే పనిని నీవు సర్రిగ్గా మూడు-రోజులు చేసి.....రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు....
యువకుడు: అలాగే సర్. అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి  వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు.....
ఆ-చేతులు కాయలుగట్టి.........
కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చి 
రక్తం కారుతూ....... గరుకుగా.......చాలా ఘోరంగా కనపడ్డాయి......
ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే అ-మూడు-రోజులు
తల్లిదండ్రుల మీద-ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేసాడు.
మరుసటిరోజు ఆఫీసుకు కాళ్లకు-చేతులకు సీసవక్కలు-ఇనుపసమాను ముక్కలు కుచ్చిన వాటికీ డాక్టర్-వద్ద ప్రథమ-చికిత్స చేయిన్చుకొని   కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ....
ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు...."
మీరు నా కళ్ళు తెరిపించారు సర్!
నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను"
దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......"
ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.......
కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా-ఆఫిసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటిచిన్న పరీక్ష పెట్టడం జరిగింది...
నీవే ఈ ఉద్యోగానికి 100% అర్హుడవు.
కాబట్టి డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండాఅసలు ఆ ఫీజుకు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగాచదువుకుని ప్రయోజకులు కండి.
ఆల్ ది బెస్ట్.............🌷🌹🌻
ఈ-కథ అందరి అమ్మ-నాన్నలకు అంకితం...


మరింత సమాచారం తెలుసుకోండి: