ప్రతిరోజూ మన నోటిని శుభ్ర పరుచుకోకుండా మన కాలకృత్యాలు పూర్తి అవ్వవు.  నోటి లోపల ఉండే సూక్ష్మ జీవాలు తొలిగించుకోవడానికి ప్రతిరోజు ఒకసారి లేదా రెండుసార్లు కాని బ్రెష్ చేసుకోవడం అలవాటు. అయితే ప్రతిరోజు ఉదయాన్న బ్రెష్ చేసుకునే ముందుగా నాలుక క్లీన్ చేసుకోవాలని కొన్ని పరిశోధనలు చెపుతున్నాయి.
సాధారణంగా బ్రెష్ చేసుకోవడం అయిన తరువాత నాలుక శుభ్రంచేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే అయినా ముందుగా బ్రెష్ చేసుకోవడం కంటే నాలుకను ముందుగా టంగ్ క్లీనర్ తో శుభ్రపరుచుకుంటే నాలుక క్రింద ఉండే క్రిములు విషపదార్ధాలు మన లోపలకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుందని కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

ముఖ్యంగా మన టంగ్ క్లీనింగ్ కు సంబంధించి సర్వసాధారణంగా ప్లాస్టిక్ లేదా స్టీల్ తో చేసిన తేలికపాటి టంగ్ క్లీనర్స్ ను వాడుతూ ఉంటాం. అయితే అలాకాకుండా రాగితో తయారుచేసిన తేలికపాటి టంగ్ క్లీనర్స్ ను మనం ఉపయోగిస్తే మన దంత సంరక్షణకు శరీర ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. మనుష్యులు ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సిన ఎంజైములు అందించడంలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. క్రిమినాశక గుణాలు రాగి లోహంలో చాలా అత్యధికంగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 

అందువల్లనే ఇప్పుడు కొన్ని పాశ్చాత్య దేశాలలో అక్కడి దంత వైద్యులు కాపర్ టంగ్ క్లీనర్స్ వాడమని సలహాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాశ్చాత్య దేశాలలోని కొన్ని హాస్పటల్స్ లోని గదులలో వివిధ రాగి పాత్రలను ఉపయోగించి ఇప్పుడు అలంకరిస్తున్నారు.

దీనికి కారణం ఆయా గదులలో ఉండే చెడు సూక్ష్మ జీవులు శాతం గణనీయంగా తగ్గించడంలో రాగి ప్రధానపాత్ర వహిస్తుందని అక్కడి వైద్యులు ఇప్పటికే గుర్తించారు. ఈ విషయాలు అన్నీ మన పురాతన ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పుడో గుర్తించినా పాశ్చాత్య దేశాలలోని ప్రజలు గుర్తించిన తరువాత మాత్రమే మనం ఈవిషయాలలోని వాస్తవాలను గుర్తించడం అలవాటుగా మార్చుకున్నాం..  


మరింత సమాచారం తెలుసుకోండి: