ఎవరికైనా వయస్సు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావడం సహజం. ఆరోగ్యపరమైన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వయస్సుతో పాటు పెరిగిపోయే ఈ సమస్యను తప్పించుకోవడం ఎవరి వల్లా కానిపని. అయితే వయస్సు పెరిగినా మనకు మతిమరుపు రాకుండా మన మెదడు చురుకుగా పనిచేయాలి అంటే రోజు మనం తినే ఆహార పదార్ధాలలో కొత్తిమీరను కూడ తప్పనిసరిగా తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని పరిశోధనలు చెపుతున్నాయి.

విటమిన్ కె పుష్కలంగా ఉండే కొత్తిమీర వల్ల మతిమరుపు తగ్గుతుందని చాలామంది ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఈ కొత్తిమీరలో శరీరంలోని కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాదు కొత్తిమీర జ్యూస్ త్రాగడం అలవాటుగా మార్చుకుంటే మన శరీరానికి సంబంధించిన పొడి చర్మం నల్లమచ్చల సమస్యలు తీరుతాయని అంటున్నారు.

దీనికితోడు  ప్రస్తుతం చాలామందిని వేదిస్తున్న మధుమేహ సమస్యకు కూడ ఈ కొత్తిమీర వాడకం మేలుచేస్తుంది అని అంటున్నారు. కొత్తిమీర రసం మన శరీరంలోని చెక్కర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించి రకరకాల గైనిక్ సమస్యలకు కూడ కొత్తిమీర వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని అంటున్నారు. 

మానసిక అలసట వల్ల వచ్చే తలనొప్పి తట్టుకోగల శక్తి ఈ కొత్తిమీరలో ఉంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచికరమైన ఆహార పదార్ధాల వంటలు అన్నింటిలోను ఈ కొత్తిమీర వాడటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని అధ్యయనాలు తెలియచేయడమే కాకుండా అనేకమంది ఆయుర్వేద వైద్యులు మన దైనందిన జీవన శైలిలో కొత్తిమీర ప్రాధాన్యత గురించి తెలియచేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: