ఆముదం ఆరోగ్యకారిణి అంటూ అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా ఆముదం గింజల నుండి తీసే చక్కనైన ఘాటైన నూనెలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనేకమందికి సమస్యగా మారిన ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆముదం నూనె ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఆముదంలో ఉండే యాంటీ ఇన్ల్పమేటరీ కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. 

అలాగే అన్ని పెయిన్స్ నుంచి గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ లేదా కీళ్లకు సంబంధించిన ఇతర 100 రకాల వ్యాధుల నివారణకు ఆముదం అనేక విధాలుగా పని చేస్తుందని వైద్యులు చెపుతున్నారు. శరీరంలో బాక్టీరియా ప్రవేశించినప్పుడు జాయింట్స్ లలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దీనివల్ల జాయంట్స్ దెబ్బతింటాయి. 

ఒకసారి జాయింట్ పెయిన్స్ వస్తే కనుక తిరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ వ్యాధి వచ్చినవారు చాలా అలసటకు గురవుతారు. ఉదయం పూట జాయంట్స్ లో భరించరాని నొప్పి వస్తుంది. ఇటువంటి వ్యక్తులకు తమ కీళ్ళ నొప్పులకు సంబంధించి సమస్యల నుండి బయటపడటానికి ఆముదం బాగా సహకరిస్తుందని అనేక సార్లు అధ్యయనాలు రుజువు చేసాయి. 

ముఖ్యంగా వెన్నెముక, మెడ లేదా మోకాలి నొప్పులకు సంబంధించి సమస్యలతో సతమతమవుతున్న వారు ఈ నూనెను వారానికి ఒకసారి ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థరైటిస్ కోసమైతే వారంలో కనీసం రెండుసార్లు ఉపయోగించాలి అని చెపుతున్నారు. దీనికితోడు అనేక స్కిన్ సమస్యలకు కూడ ఈ ఆముదం నూనెతో పరిష్కారం దొరుకుతుంది. ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ ఆముదం జీర్ణక్రియ మెరుగు పరుచు కోవడానికి తీసుకునే పద్ధతి కూడ ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో ఈమధ్య కాలంలో ఈ ఆముదాన్ని ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: