Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Mar 20, 2018 | Last Updated 9:15 pm IST

Menu &Sections

Search

ఇంతకీ మీది ఏ స్నానం...?

ఇంతకీ మీది ఏ స్నానం...?
ఇంతకీ మీది ఏ స్నానం...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.  అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు.సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు. కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...?  దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో... 
 
 🚿తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 
🚿5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.
🚿 ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. 
🚿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. 
ఇది అధమాతి అధమం. 
కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.
 
🚿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.
 🚿ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.
 🚿చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం. 
🚿వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
 
🚿ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు. 
కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.
 షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.
 ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.
 
 ⛱ పురాణాలలో స్నానం :
మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.
 అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది. 
 
⛱ మంత్ర స్నానం:
 వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

 
⛱ భౌమ స్నానం :
 పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".
 
⛱ ఆగ్నేయ స్నానం:
 సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"
 
⛱ వాయువ్య స్నానం: ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"
 
⛱ దివ్య స్నానం:
లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం".
 ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
 
⛱ వారుణ స్నానం:
 పుణ్య నదులలో స్నానం ఆచరించడం 
"వారుణ స్నానం".
 
⛱ మానస స్నానం :
 నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం
 "మానస స్నానం".
 ఇది మహత్తర స్నానం. 
మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
 🎊 స్నానాలు రకాలు
🌧 మానస స్నానం:
 దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.
🌧 క్రియాంగ స్నానం:
 జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.
🌧 దైవ స్నానం:
 ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.
🌧 మంత్ర స్నానం:
 వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.
🌧 రుషి స్నానం:
 ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.
🌧 మానవ స్నానం:
 ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.
🌧 రాక్షస స్నానం:
 ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.
🌧 ఆతప స్నానం:
 ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.
🌧 *మలాపకర్షణ స్నానం:
మాలిన్యం పోవుటకు చేయు స్నానం.


bath-rules-bath-time-in-south-india-indian-culture
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

What you have to remember is that it isn't you who is being personally rejected. It simply means that a particular agent wasn't interested in what you wrote.