సంవత్సరం అంతా అన్ని సీజన్స్ లోను ప్రతిచోట దొరికే జామకాయల వల్ల మనకు సమకూరే ప్రయోజనాల గురించి అనేక సార్లు తెలుసుకున్నాం. ఈ జామకాయ‌ల‌లో విటమిన్ సి విపరీతంగా ఉండటం వల్ల శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెరగడమే కాకుండా అనేక జీర్ణ సమస్యలు తొలగిపోతాయి అన్న విషయాలు అందరికీ తెలిసినవే. అయితే జామకాయలతో పాటు జామ ఆకుల వలన కూడ వచ్చే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం సహజం.

జామ ఆకులు సూక్ష్మజీవుల్ని నిరోధిస్తాయి. జామ ఆకులు నీటిలో ఉడుకబెట్టి ఆ నీటిని తాగితే కడుపునొప్పి పోతుంది. విరేచ‌నాలు, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామాకుల్ని తినటం వల్ల దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను కూడా ఈ జామాకులు దూరం చేస్తాయి. 

జామ ఆకులతో టీ చేసుకొని తాగితే చక్కని ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర శాతం అధికం కాకుండా జామ ఆకులు నియంత్రిస్తాయి కాబట్టి డయాబెటీస్ రోగులకు ఈ జామాకుల టీ ఎంతో మేలు చేస్తుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అంతేకాదు జామాకులతో చేసిన టీ తాగటం వల్ల శ్వాసకోశ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. జామ ఆకుల్లో విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. 

ఈ విటవిన్‌ బి కణాల నిర్మాణంలో సహాయపడుతుంది. అదేవిధంగా చర్మ సౌందర్యానికి కూడ ఈ జామాకులు సహాయ పడతాయి. గుప్పెడు జామాకుల్ని లీటరు నీటిలో 20 నిమిషాల పాటు ఉడుకపెట్టి ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేసుకుంటే  జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు తలెత్తవు అని అంటారు. ముఖ్యంగా ప్రస్తుత మనదేశ జనాభాలో 40 కోట్లమంది  ప్రజానీకాన్ని పీడిస్తున్న ఈ డయాబెటీస్ సమస్యకు ఈ జామాకులతో అనేక చిట్కాలు ఉన్నాయి అని ఆయుర్వేద వైద్యులు అనేక ఆశ్చర్యకర విషయాలను బయటపెడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: