క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే నల్ల మిరియాలు ఒకప్పుడు మన దేశంలో ఎక్కువగా పండించేవారు. అయితే ఈమధ్య కాలంలో ఈ మిరియాల పంటను పండించే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఈ నల్ల మిరియాలను ప్రస్తుతం అమెరికాలో ఎక్కువగా పండించడమే కాకుండా అనేక ఆహార పదార్ధాలలో వాడుతున్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. 

మిరియాల్లో కేవలం నల్లవే కాకుండా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లో కూడ ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా నల్ల మిరియాలు వల్ల మాత్రమే ప్రయోజనాలు సమకూరుతాయి. న‌ల్ల మిరియాలు ఘాటైన వాసనను కలిగి ఉండటమే కాకుండా ఇవి మన శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి.

శ్వాస‌కోశ స‌మస్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం కలిగించడమే కాకుండా లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి ఈ నల్లమిరియాలు.  
పొట్టలోని వాయువులను బయటికి నెట్టి వేసే శక్తి మిరియాలకు ఉంది. రక్తప్రసరణ వేగవంతం అయ్యేందుకు కూడా ఇవి తోడ్పడుతాయి. కొవ్వు పేరుకోకుండా శరీరంలో స్వేద ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు మూత్ర విసర్జన సాఫీగా జరిగే విషయంలో నల్ల మిరియాలు ఎంతగానో సహకరిస్తాయి. చిటికెడు రాతి ఉప్పుతో పాటు మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి. 

మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతుంది. అదేవిధంగా ఈ నల్ల మిరియాలు వల్ల ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మన ముఖం పై మొటిమలు తగ్గేందుకు, యాంటీ బయోటిక్‌గా అసిడిటీ సమస్యకు, శరీరంలో అధిక వేడికిని తగ్గించడానికి నల్ల మిరియాలు ఎంతాగానో సహకరిస్తాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: