న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీ పండ్లు ఇప్పుడు మన దేశంలోనూ విరివిగా లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు సి విటమిన్‌, ఆపిల్‌ కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ ఈ కీవీ పండులో ఉంటాయి  అన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం.

 

పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాలు ఈ పండ్లలో లభిస్తాయి . దీనికితోడు వీటిలో కొవ్వు, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండ్ల వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

 

 మన శరీరం లోని  అధిక బరువును కూడా తగ్గించుకోవడానికి కూడ ఈ పండ్లు బాగా ఉపయోగ పడతాయి .ఇది ఇలా ఉండగా ఈ మధ్య జరిగిన ఒక పరిశోధనలో అన్ని పండ్లలో కంటే ఇందులోనే అధిక పోషకాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. కీవీ పండులో విటమిన్లు, ఫ్లావనాయిడ్స్, ఖనిజలవణాలు పుష్కలంగా  ఉన్న నేపధ్యం లో రోజుకు 2 నుంచి 3 పండ్లు తీసుకుంటే వయసు పెరుగుదలలో వచ్చే కంటి సంబంధిత మాక్యులార్ క్షీణత 36 శాతం వరకూ తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.

 

దీనికితోడు  కేన్సర్‌కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్థాలు కూడా ఈ పండులో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా కీవీ పండు రసం చర్మ క్యాన్సర్‌ను కూడా నిరోధిస్తుందని వైద్యులు చెపుతున్నారు. అదే విధం గా జీర్ణక్రియను వేగవంతం చేయడం లో కుడా ఈ పళ్ళు ఎంతగానో సహాయ పడతాయి. చివరకు ఈ పండు తొక్కలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో కూడి పీచు పదార్ధం ఉంటుంది. దీనితో రోజుకి కనీసం  రెండు నుంచి మూడు కివీలు తిన్నవారకి ఎన్నో ప్రయోజనాలు చేకురతాయి అని లేటెస్ట్ పరిశోధనలు తెలియ చేస్తున్నాయి ..


మరింత సమాచారం తెలుసుకోండి: