మల్లెల గుబాళింపులు నచ్చని వారు ఉండరు. సుగంధ భరితమైన ఈపువ్వుల నుండి  వచ్చే సువాసన  ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా మన నాడీవ్యవస్థ మీద తీవ్రప్రభావం చూపుతుంది అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఈ మల్లె పువ్వుల నుండి వచ్చే సువాసన మనిషిలోని మానసిక అందోళన తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుందని కూడ పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  

 

ఇక ఈ మల్లెపూలతో తయారు చేసిన టీ వల్ల కూడ అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు చైనా, జపాన్‌ దేశాలలో ఈ జాస్మిన్ టీ చాలా పాపులర్. ఈ టీ వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుతం మన దేశంలోనూ ఈ టీ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. మనసరీరంలోని రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచే గుణాలు ఇందులో ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ టీ ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు.

 

 దీనికితోడు ఈ టీ ప్రభావం వాళ్ళ రక్తంలోని తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్ అదుపులో ఉంచే గుణాల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం దరిచేరదు మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి తోడ్పడుతుంది. మల్లెపూల టీతో పుక్కిలిస్తే చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం తగ్గుతాయి అని కూడ ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. అదే విధంగా  కడుపులో అల్సర్లు, కేన్సర్‌లను  ఈ టీ నిరోధిస్తుంది.

 

 అంతేకాదు చాలామందికి తరుచు వచ్చే  జలుబు, దగ్గు, అలర్జీల నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ జాస్మిన్ టీ తాగిన వారు  వృద్ధాప్య చాయలకు దూరంగా ఉంటారు. దీనికితోడు  కండరాలు, కీళ్ళ నొప్పులను నివారించే గుణం ఇందులో ఉండటంతో ఈ టీ ని తీసుకోవడం అన్నివిధాలా మంచిది అని చెపుతున్నారు. ఈ కారణాల వల్ల ఈమధ్య మనదేశంలో కూడ ఈ జాస్మిన్ టీ వాడకం పెరిగింది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: