వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు మన నొప్పులను తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని, దీన్నే“ప్రేమ ప్రేరేపిత బాధానివారిణి” (లవ్ ఇన్‌డ్యూస్‌డ్ అనల్జేసియ) అంటారని అంతర్జాతీయంగా పలు శాస్త్రవెత్తలు చెబుతున్నారు.

Related image

బాగా తలనొప్పితో తల పగిలిపోతూ ఉంటే మనం, వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసు కుంటాం. దాంతో ఉపశమనం దొరికి  తలనొప్పి తగ్గిపోతుందని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ అసలు ఇలాంటి మాత్రలుతో పని లేకుండానే తలనొప్పి తగ్గే మంచి మార్గం ఒకటి ఉంది అది ఔషదంలాగా కృత్రిమంగా కాకుండా అతి సహజంగా లభించే పారమార్ధిక ఔషధం. అదే మంచి కౌగిలి. మనను బాగా ప్రేమించేవాళ్లు ఆప్యాయంగా ఒక్కసారి కౌగలించుకుంటే తలనొప్పి, చికాకు అన్నీ ఎక్కడికక్కడే మటుమాయమైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Image result for beautiful hug between a deep lovers and couple 

అయితే, ఎవరుపడితే వాళ్లు కౌగిలించుకుంటే, పట్టుకుంటే మాత్రం ఇలాంటి నొప్పులు తగ్గవట. ఎందుకంటే, వాళ్ల పట్ల మనకు ఎలాంటి సహజసిద్ధ అనుభూతులు, స్పందనలు (ఫీలింగు)  ఉండ వని చెప్పారు. నొప్పులను మర్చిపోయేలా మెదడుకు సంకేతాలు పంపాలంటే అవతలి వాళ్లు మనల్ని బాగా ప్రేమించే వాళ్లు అయి ఉండాలని తెలిపారు.

 Related image

ఆంగ్లేయులు ఇలాంటి తలనొప్పులు వచ్చినప్పుడు మందుల షాపు వద్దకు వెళ్లి నేరుగా కొనగోలు చేసే మందుల విలువ దాదాపు ఏడాదికి 4071 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఇలా మందులు వాడటం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని, ప్రత్యామ్నాయం ఏంటన్న ఆలోచనలు బాగా పెరిగాయి. అదే వారిలో ఆలోచనలు రేపాయి. పరిశోధనలకు దారితీసాయి.

Related image 

అందులో భాగంగానే శాస్త్రవేత్తలు ప్రయొగాలు ఆలోచనలు చేసిన ఫలితమే మనస్తత్వ శాస్త్ర వేత్తలు ప్రేమ ఆత్మీయతతో కూడిన స్పర్శ ప్రేరేపిత  “‘కౌగిలి” మాత్రమే దీనికి సరైన మందుగా గుర్తించారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌ లోని హైఫా యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది  వాలంటీర్లను తీసుకుని వాళ్లతో ప్రయోగాలు చేశారు.

Image result for love induced analgesia 

కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు వేర్వేరు వ్యక్తులను ముట్టు కోవడం, తర్వాత వాళ్లు ప్రేమించేవాళ్లతో కౌగిలి ఇప్పించడం లాంటివి చేశారు. అప్పుడే వాళ్లకు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభించి నట్లు తేలింది.

Image result for an excellent Hug and embrace 

2011లో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి పరిశోధన ఒకటి జరిగింది. ప్రేమికుడు లేదా ప్రేయసి ఫొటో వైపు తదేకంగా చూసినా కూడా నొప్పి 44 శాతం తగ్గుతుందని అప్పట్లో చెప్పారు.

Image result for an excellent Hug and embrace 

అనురాగం అనుబంధం స్నేహం ప్రేమ ఆత్మీయతలతో కూడిన స్పర్శ మాత్రమే సర్వనొప్పు లకు సరైన సహజమైన నివారణ అని వారు నిర్ధారించారు. సో! తలనొప్పిగా ఉందా? తలనొప్పి తో తల పగిలిపోతుందా? బ్రద్ధలౌతుందా? ఇక పడకగదిలోకి మీ శ్రీమతిని పిలవండి కౌగిలిలో ఉయ్యాలలూగండి. ప్రియురాలి కౌగిలి ఊయలలూగితే చాలు తలనొప్పులే కాదు అన్నీ నొప్పుల హుష్..కాకి..

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: