జీడిపప్పును ఇష్టపడని వారు ఉండరు. చక్కని రుచి కోసం అన్ని రకాల వంటలలోను దీనిని వాడతారు. అయితే ఈజీడి పప్పు వలన కేవలం రుచి మాత్రమే కాకుండా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఈ జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి.

 

శరీరానికి సంపూర్ణ పోషకాహారాన్ని ఇవి అందిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ గుప్పెడు జీడిపప్పు తింటే మనకు ఎలాంటి అనారోగ్యాలు కలగవు అన్న విషయాన్ని ఆయుర్వేద వైద్యులు కూడ చెపుతున్నారు.  జీడిపప్పు ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. అంతేకాకుండా ట్యూమర్ల పెరుగుదలను ఈ జీడిపప్పు అడ్డుకుంటుంది.  జీడిపప్పులో ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది.

 

హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. బీపీ కంట్రోల్ అవుతుంది. అదే విధంగా జీడిపప్పులో ఉండే కాపర్, కాల్షియం, మెగ్నిషియంలు శిరోజాలు, ఎముకలు, దంతాలకు ఎంతగానో అవసరం. వీటివల్ల శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.  దీనికితోడు మన శరీర నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేసే ఔషధ గుణాలు జీడిపప్పులో ఉన్నాయి.

 

జీడిపప్పును రోజూ తినడం వల్ల గాల్ స్టోన్స్ వచ్చే అవకాశాలు 25 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.  అంతేకాదు రోజూ గుప్పెడు మోతాదులో జీడిపప్పును తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనికి తోడు జీడిపప్పును తినడం వల్ల జీర్ణ సమస్యలు పోయి గ్యాస్, అసిడిటీ, అజీర్ణంభాదల నుండి విముక్తి పొందవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ జీడిపప్పును తినడం అన్నివిధాలా మంచిది అన్న విషయాన్ని వైద్యులు కూడ చెపుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: