అల్లం గురించి తెలియనివారు ఉండరు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో అల్లం ఒక భాగం. ప్రకృతి ప్రసాధించిన వనమూలికల్లో అల్లం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లం వంటల్లోనే కాదు అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మన పూర్వికులు దాని ప్రాధాన్యత తెలిసి మనం రోజుతినే ఆహారంలో ఏదో ఒక రూపంలో ఇది మన శరీరంలోకి చేరే విధంగా మనకు తరతరాలుగా అనేక అలవాట్లు చేసారు. 

అయితే అధునాతన వంట పద్ధతులు వచ్చిన తరువాత రానురాను మనం అల్లం తక్కువ మోతాదులోనే వాడుతున్నాం. అల్లం కాస్త ఘాటుగా ఉండటం వల్ల దాన్ని డైరెక్ట్ గా ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. జ్యూస్ రూపంలో అయితే అల్లం రసం తీసుకోవడం వల్ల అమోఘమైన ఫలితాలు పొందవచ్చని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.  


అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఓ టీస్పూన్ చొప్పున మూడు పూటలా సేవిస్తే దగ్గు, ఉబ్బసం, జలుబు, అజీర్తి సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.   అంతేకాదు సన్నగా తరిగిన అల్లం ముక్కలు జీలకర్ర సమానంగా కలిపి నేతిలో దోరగా వేయించి ప్రతి ఉదయం పరగడపున తింటే అసిడిటీ దూరమవుతుంది. అల్లం, బెల్లం, నువ్వులు వీటిని సమానంగా దంచి ఉసిరికాయ ప్రమాణంలో రెండు పూటలా తింటూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది అని అనేక మంది ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 


దీనికితోడు  అల్లం మంచి యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అదే విధంగా మన శరీర రక్త శుద్ధికి  అల్లం తోడ్పడుతుంది.  ఇలా కొన్ని వారాల పాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.  ముఖ్యంగా  నోటి దుర్వాసనను దూరంచేయడంలో అల్లంరసం చాలా ప్రధాన్యతను కలిగి ఉంది. ముఖ్యంగా మన నోటిలో చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియాను నశింపచేయడంలో ఈ అల్లంరసం ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా ఎనో ప్రయోజనాలుకల ఈ అల్లం రసంను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది అని అనేకమంది వైద్యులు చేపుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: