ప్రస్తుతం అందరికీ అధిక బరువు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలపట్ల అవగాహన రావడంతో ఆ అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో భాగంగా ప్రతిరోజు    30 గ్రాముల ఫైబర్ పిచు పదార్ధం ఉండే ఆహార పదార్ధాలను మనం క్రమమం తప్పకుండా తీసుకుంటే  మన అధిక బరువు మాత్రమే కాకుండా మన సైజ్ కూడా చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

 

స్వీడన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌ బర్గ్‌కు చెందిన సైంటిస్ట్ గున్నార్ సిహాన్సన్ తన పరిశోధక బృందంతో కలిసి ఫైబర్ అధిక బరువు అనే అంశం పై ఇటీవల పరిశోధన చేసి సమర్పించిన  పరిశోధనలలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈక్రమంలో ఈ పరిశోధన  నిర్వహించిన వారు దాదాపు 4051 మందికి చెందిన ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకుని వారు రోజూ తీసుకునే ఆహార పదార్ధాలలో ఉండే ఫైబర్ శాతాన్ని లెక్కించారు.

 

ఈక్రమంలో వారు చెపుతున్న విషయాల ప్రకారం  నిత్యం 30 గ్రాముల ఫైబర్ శరీరానికి అందేలా ఫై బర్ ఉన్న ఆహారాలను తింటే దాంతో అధిక బరువు చాల వరకు తగ్గుతుందని నడుం సైజ్‌ను తగ్గించుకోవచ్చని ఈపరిశోధన నిర్వహించిన వారు చేపుతున్నారు. అంతేకాకుండా ఈ ఫైబర్ వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేస్తుందని ఫలితంగా షుగర్ స్థాయిలు కంట్రోల్‌ లో ఉంటుందని చెపుతున్నారు.

 

ఈ క్రమంలోనే ఫైబర్ ఎక్కువగా ఉండే బటానీలు, బ్రొకొలి, ఫిగ్స్, బెర్రీలు, తృణ ధాన్యాలు, బీన్స్, అవకాడోలు, బెండకాయలు, శనగలు, నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి రోజూ తింటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చని ఈపరిశోధకుల సలహాలు. దీనితో మన ఆరోగ్యానికి ముఖ్యంగా మన బరువును తగ్గించే ఫైబర్ పదార్థాలను ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది అని అంటున్నారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: