ఇప్పటి వరకు అనేక పరిశోధనల ఫలితాలు పొగ త్రాగడం ఎంత హానికరమో అందరికీ తెలిసేలా చేసింది. దీనితో అనేక పేపర్ల నుండి ధియేటర్ల వరకు పొగ త్రాగడం వల్ల వచ్చే అనర్ధాలను తెలిసి వచ్చేలా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. అయితే సిగరెట్ల పొగ కంటే మనం ఎంతో ఆధ్యాత్మిక పవిత్ర భావనతో వెలిగించే అగబరబత్తిల నుండి వచ్చే పొగ మరింత ప్రమాదకరం అని అంటూ ఈమధ్య లేటెస్ట్ అధ్యయనాలు వెలుగులోకి వస్తున్నాయి.  

 AGARBATTI STICKS PHOTOS కోసం చిత్ర ఫలితం

 

ఆశ్చర్యం కలిగించే ఈవార్తలను చైనాకు చెందిన ఒక పరిశోధన సంస్థ లేటెస్ట్ గా వెలుగులోకి తీసుకు వచ్చింది. సాధారణంగా అగర్ బత్తీని ముట్టించగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. అగర్ బత్తీ వాసనతో మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. అయితే ఇది ప్రమాధకరం  అని అంటున్నాయి లేటెస్ట్ పరిశోధనలు.

 AGARBATTI STICKS PHOTOS కోసం చిత్ర ఫలితం

చైనా పరిశోధనా సంస్థ చెపుతున్న వార్తల ప్రకారం అగర్ బత్తీల నుంచి వచ్చే పొగలో నుంచి వెలువడే అతి చిన్న పరిమాణంలో ఉండే అణువులు గాలిలో కలిసిపోతాయి. ఆ పొగ నుంచి వచ్చే అణువుల్లో విషపూరితమైన పరమాణువులు ఉంటాయట. అవి మన శరీరంలోని ప్రతి కణం లోపలికి వెళ్తాయి. అవి మన శరీరానికి హాని చేస్తాయి. ఒక్కోసారి అవి క్యాన్సర్‌కు దారి తీస్తాయని ఈ లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి. మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అనే మూడు రకాల విష పదార్థాలు మన శరీరాన్ని రకరకాల వ్యాధులకు గురి చేస్తాయని ఆ పదార్ధాలు అగరాబత్తీల పొగలో ఉన్నాయని చైనా పరిశోధకులు చెపుతున్నారు.

 

ఈ అగరాబత్తీల నుండి వచ్చే పొగ వల్ల మన శరీరంలో జన్యు పరిణామంలో వచ్చే మార్పులు డీఎన్‌ఏను కూడా మార్చేస్తాయి అని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ పరిసోధనలలోని . వాస్తవాల పై ఇంకా క్లారిటీ లేకపోయినా మన పూజలలో అదేవిధంగా మన దేవుళ్ళ ఆలయాలలో మనకు ఎప్పుడు కనిపించే ఈ అగరబత్తి పోగలను చూస్తే ఎవరికైనా ఖంగారు పడటం సహజం.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: