Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 15, 2018 | Last Updated 10:49 pm IST

Menu &Sections

Search

వివేక వాణి!

వివేక వాణి!
వివేక వాణి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు . మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది . ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు . 
viveka-nandhu-భవతి-భిక్షామ్-దేహి-భిక్షాపాత్రల్లో-బ
పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు . 
మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు . 
viveka-nandhu-భవతి-భిక్షామ్-దేహి-భిక్షాపాత్రల్లో-బ

పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు . 
వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .  

ప్రశ్న - సమాధానం 
----------------
ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?
స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .
ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?
స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .
ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 

స : నిజమే స్వామీ !
-----------------
మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం.

   

            

viveka-nandhu-భవతి-భిక్షామ్-దేహి-భిక్షాపాత్రల్లో-బ
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author