ఈ రోజుల్లో చాటింగ్ చాలా కామన్ అయిపోయిందని చెప్పవచ్చు. అయితే అబ్బాయిలు చాటింగ్ ద్వారా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని భావిస్తుంటారు. గర్ల్స్‌ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అమ్మాయిని ఎంతగా ప్రేమించినా.. తనతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక కొందరు తెగ ఇబ్బంది పడుతుంటారు. ఎలాగోలా కష్టపడి సోషల్ మీడియాలో ఫ్రెండ్ అయ్యాక లేదా ఫోన్ నంబర్ పట్టేశాక.. చాటింగ్ మొదలు
పెట్టాలంటే కిందా మీద పడుతుంటారు.
Image result for chatting
మరి అమ్మాయిని ఇంప్రెస్ చేసేలా చాటింగ్ ఎలా చేయాలి? మెల్లగా తనకు ఎలా ప్రపోజ్ చేయాలంటే..చాటింగ్ మొదలెట్టడానికి ముందు.. తన ప్రొఫైల్, షేర్ చేసిన ఫొటోలు, డెయిలీ స్టేటస్‌ను పరిశీలించండి. తనను అర్థం చేసుకోవడానికి, తనకు ఏమేం ఇష్టమో తెలుసుకోవడానికి ఇదిఉపయోగపడుతుంది. వాట్సాప్‌లో అయితే స్టాటస్ ద్వారా తనెలాంటి అమ్మాయో, తన ఇష్టాయిష్టాలేంటో  ఓ అంచనాకు రావచ్చు.
Image result for chatting
కొద్ది రోజులు తన ప్రొఫైల్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. ఏ టైంలో ఆన్‌లైన్లో ఉంటుందనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఫేస్‌బుక్‌లో తను లైక్ చేసిన లేదా షేర్ చేసిన వాటికి మీరు కూడా లైక్ కొట్టండి. తనకు ఇష్టపడేలా.. వాట్సాప్ స్టేటస్‌లు మార్చుతుండండి. తద్వారా మీ ఇద్దరి మధ్య కొన్ని విషయాలు కామన్‌గా ఉన్నాయని తను భావిస్తుంది. వాట్సాప్‌లో చాట్ చేస్తున్నట్లయితే చక్కటి ఫొటోను డీపీగా ఉంచండి. స్టాటస్ కూడా మీదైన స్టయిల్లో ప్రత్యేకంగా ఉండేలా చూస్కోండి. ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేయాలనుకుంటే.. తనకు నచ్చే సెలబ్రిటీల పోస్టులకు లైక్ కొట్టండి, షేర్ చేయండి. సామాజిక సమస్యలపై స్పందించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: