ఒక సెమినార్లో 50 మంది కూర్చుని వేదిక మీద ప్రసంగం చేస్తున్న స్పీకర్ మాటలను శ్రద్ధగా వింటున్నారు. కొద్ది సేపు తరువాత స్పీకర్ తన ప్రసంగాన్ని ఆపి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి దాని మీద ఎవరి పేరు వారు రాయండి అని చెప్పాడు. అందరు అలా చేసారు.తరువాత సెమినార్ జరుగుతున్న గదికి పక్కన ఉన్న మరొక గదిలోకి వెళ్లి ఒక మూలన అన్ని బెలూన్లు పెట్టి రండని అన్నాడు..... 

వాళ్ళు అలాగే చేసి మొదటి గదిలోకి వచ్చి తమ తమ సీట్లల్లో కూర్చున్నారు. ఈ సారి అందరు వెళ్లి మీ మీ బెలూన్ లు వెంటనే పోయి తెచ్చుకొమ్మని స్పీకర్ చెప్పాడు. అందరు వెంటనే లేచి బెల్లూన్లు ఉన్న గదిలోకి వెళ్లి వాళ్ళ పేర్లున్న బెలూన్ల కోసం వెతకసాగారు.. అందరు ఒకేసారి వచ్చి గోల ,గోల చేస్తూ నాకే ముందు దొరకాలని ఉద్దేశ్యంతో వెతకటం వళ్ళ ఎవ్వరికి వాళ్ళ వాళ్ళ పేర్లున్న బెలూన్లు దొరకలేదు, ఒకరివి మరొకరికి వచ్చాయి.....
Image result for assembly meeting
తరువాత స్పీకర్ వచ్చి చుస్తే ఎవ్వరికి వారి పేర్లు ఉన్న బెలూన్ దొరకలేదు, అందరు బలూన్లు అక్కడే ఉంచి వెనుకకు రమ్మని చెప్పగానే అందరు అలా చేసారు. ఈ సారి స్పీకర్ వారందరిని కొద్ది సేపు తీక్షణంగా చూసి మీరు మరొకసారి ప్రయత్నించండి కాకపోతే ఈ సారి ఎవరికైతే బెలూన్ దొరుకుతుందో అది వారి చేతులోకి తీసుకొని దాని మీద ఉన్న పేరు చెప్పండి వాళ్ళు వచ్చి ఆ బెలూన్ తీసుకుంటారు, అలాగే అందరు చెయ్యండి దొరుకుతుంది అని చెప్పి మళ్ళి ఆ గదిలోకి పంపించాడు...ఈ సారి ఎవ్వరు ఏమ మాట్లాడకుండా పోయి బెలూన్ పట్టుకుని స్పీకర్ చెప్పినట్టు చేసారు... 2 నిమిషాల్లో పని అయిపోయి అందరు వాళ్ళ బెలూన్లు చేతులో పట్టుకుని గది నుండి బయటకు వచ్చారు...   

ఇదంతా చూసిన స్పీకర్ గంభీరమైన స్వరం తో ఇలా అన్నాడు:-
Image result for speech meeting
"సరిగ్గా ఇలాంటివే మన జీవితం లో కూడా జరుగుతున్నాయి .ఎవరికోసం వారే బ్రతుకుతున్నారు కానీ ఇతరులకు సహాయం చెయ్యాలని మీలో లేకుండా పోయింది కాబట్టే పిచ్చి పట్టిన వారి లాగ గదిలోకి వెళ్ళితే దొరకలేదు కానీ ఇతరులకు సహాయం చేస్తే నీకు అదే సహాయం దొరికింది. మీరు ఇతరులకు సహాయపడి వారికి సంతోషాన్ని ఇవ్వగలిగితే మీరు అడగకుండానే మీకు కూడా సహాయం దొరుకుతుంది".

మరింత సమాచారం తెలుసుకోండి: