Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jan 20, 2019 | Last Updated 4:17 pm IST

Menu &Sections

Search

అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారుస్తాయి

అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారుస్తాయి
అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారుస్తాయి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనిషి ప్రవర్తనలో ఈ మద్య వచ్చిన అనేక ప్రతికూల మార్పులు గమనిస్తే అతని మనసులో పెరిగిపోతున్న "కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు" మాత్రమే కారణం. ఈ ఆరు దుర్లక్షణాలను "అరిషడ్వర్గాలు" గా పిలుస్తారు. దీని విస్త్రుత అర్ధం ఏమంటే అరి (శత్రువు) షడ్ (ఆరు) వర్గాలు (రకాలు) మనసును ఆలోచనలను ప్రభావితం చెసే ఆరు శత్రు విభాగాలు లేదా లక్షణాలు అని చెప్పొచ్చు.  ఈ మనిషిని ప్రేరేపించే ప్రతికూల అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారు స్తాయి. ఇవి మనిషి పతనానికే కాదు, ప్రకృతి వినాశనానికి దోహదం చెసే ప్రధాన అంశాలు

kamam-krodham-lobham-moham-madham-mastaryam-ap-pol

1.కామం– "కామాతురాణాం న భయం న లజ్జ" అంటే అర్ధమదే. కామం సర్వానర్ధాలకు మూలంకామం అంటే కోరిక లేదా వాంచ ఇది కావాలి, అది కావాలి అని మనిషి పడే తాపత్రయానికి ప్రధాన ఆధార ప్రతికూల లక్షణం. అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండటం. అంతే తాను జీవిస్తే,సుఖిస్తే చాలు అని కాకుండా, తన తరతరాలు ఊహలకు మించిన కోరికలు తీర్చుకోవాలన్న అభిలాష అన్నమాత. 

kamam-krodham-lobham-moham-madham-mastaryam-ap-pol

2.క్రోధం – క్రోధం అంటే కోపం, ఆగ్రహం. కోరుకున్న కోరికలు తీరనదుకు కారణాలు తనలోని "కామం" అని గుర్తించకుండా మనసు చింతిస్తుంది. అంతే కాదు తన వాంచలు తీరక పోవడానికి కారణం వెతికి అందుకు ఇతరులు అడ్డుపడటమేనని భావించి వారిపై ప్రతీకారేచ్చ పెంచుకొని రగిలిపోతూ కక్ష పెంచుకొని పగ  తీర్చుకోవాలనే ఉద్రేక పూరిత నిర్ణయాలు తీసుకుంటుంది. క్రోధాన్ని అగ్ని తో పోలుస్తారు. ఇది ఉంటే మనిషిని మనసును ప్రకృతిని దహించివేస్తుంది.