ప్రస్తుతం జనాన్ని హడలేత్తిస్తున్న వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ప్రజలు రకరకాల పానీయాలను సేవిస్తూ ఆ వేసవి తాపం నుండి బయట పడటానికి ప్రయత్నిస్తారు. వర్తమాన పరిస్థుతులలో జనం జీవన శైలి బాగా పెరిగిపోవడంతో చిన్నచిన్న పనులు చేసుకునే వారిళ్ళలో కూడ ఫ్రిజ్ లు ఉంటున్నాయి. దీనితో చల్లటి మంచినీరు త్రాగాలి అంటే అందరి దృష్టి ఫ్రిజ్ లోని చల్లని నీళ్ళ పైనే దృష్టి ఉంటుంది. 
POT WATER PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలాంటి పరిస్థుతులలో గ్రామీణ ప్రాంతాలలో తప్ప మరెక్కడా ప్రస్తుతం మట్టి కుండలు కనిపించడం లేదు. అయితే ఈ వేసవిలో మట్టి కుండలోని నీటిని త్రాగితే మన శరీరానికి లభించే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎంత గొప్ప వారైనా ఈ మట్టి కుండలోని నీటినే తప్పకుండా త్రాగుతారు.  మట్టికుండలో నీటిని పోస్తే దానికి ఉండే లక్షణాల కారణంగా ఆ నీటిలో ఉండే మలినాలను కుండ పీల్చుకుంటుంది అన్న విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించారు. 
POT WATER PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు మట్టి కుండలో నీటిని పోయడం వల్ల ఆ కుండలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ముఖ్యంగా మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఈమట్టి కుండలో నీటిలో నిల్వ ఉంచిన నీటితో లభిస్తాయి. అదేవిధంగా ఈ నీటి వల్ల మన వ్యాధి నిరోధక శక్తీ పెరిగి అనేక రకాలైన బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లతో మన శరీరం పోరాటం చేయగలుగుతుంది.  ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉండడం వల్ల మన శరీరంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మట్టి కుండలో పోసిన నీటిని తాగితే అప్పుడు ఆ ఆమ్లత్వ ప్రభావం తగ్గుతుంది. 
POT WATER PHOTOS కోసం చిత్ర ఫలితం
శరీరం ఆల్కలైన్ స్థితికి చేరుకుని ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అదేవిధంగా మట్టి కుండలో పోసిన నీటిని తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా జరిగి మెటబాలిజం రేటు మెరుగుపడుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి మట్టికుండలో ఉంచిన నీటిని ఇవ్వగలిగితే ఆ సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈమట్టి కుండను ప్రతి ఇంట్లో పెట్టుకోవడం ఆరోగ్యరీత్యా చాల మంచిది..  


మరింత సమాచారం తెలుసుకోండి: