మన దేశంలో రోజురోజుకి డయాబెటీస్ ఉన్నవారి సంఖ్య పెరిగిపోతున్న నేపధ్యంలో రానున్న రోజులలో ప్రపంచంలో అత్యధిక డయాబెటీస్ వ్యాధి ఉన్న ప్రజలు గల దేశంగా మన ఇండియా మారుతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈవ్యాధి పై అవగాహన కల్పించదానికి అనేక స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ చాలామంది ఈవ్యాధి వల్ల వచ్చే సమస్యలను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఈనేపధ్యంలో మధుమేహం ఉన్నవారు నిర్భయంగా నెయ్యి తింటే వచ్చే ప్రయోజనాలు అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 
GHEE PHOTOS కోసం చిత్ర ఫలితం
వైద్యులు కూడ ఈమధుమేహం వ్యాధికి నెయ్యి వల్ల ప్రయోజనం కలుగుతుందని అంగీకరిస్తున్నారు. అయితే వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి సేవిస్తే మంచిది అని వైద్యులు చెపుతున్నారు. అది కుదరకపోతే బయట దొరికే ఆర్గానిక్ నెయ్యి అయినా వాడవచ్చు అని సలహాలు ఇస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారు నెయ్యిని తినవడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో జీర్ణ సమస్యలుంటాయి. మలబద్దకం ఉంటుంది. నెయ్యి తింటే జీర్ణ సమస్యలు తొలిగి పోయి మలబద్ధ సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. 
GHEE PHOTOS కోసం చిత్ర ఫలితం
నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అయితే అది నిజం కాదని అధ్యయనాలు చెపుతున్నాయి. వాస్తవానికి నెయ్యి తింటే శరీరంలో కొవ్వు చేరదు. ఉన్న కొవ్వు కరుగుతుంది. బాగా లావుగా ఉండే టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. దీనితో రోజూ నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ అవుతుందిఅని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. దీనికితోడు నెయ్యిలో ఉండే విటమిన్ కె శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. 
GHEE PHOTOS కోసం చిత్ర ఫలితం
డయాబెటిస్ ఉన్న వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మఖ్యంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నం బ్రెడ్ పరోటాలు తదితర ఆహారాల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దీనితో ఆ ఆహారాలను డయాబెటిస్ ఉన్నవారు తింటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగి అనేక సమస్యలు ఏర్పడతాయి.అయితే అలా పెరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవారు ఆ ఆహారాలలో నెయ్యి కలిపి తీసుకుంటే గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా షుగర్ కంట్రోల్‌ లో ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కనుక ఎటువంటి సందేహం లేకుండా డయాబెటీస్ ఉన్నవారు నెయ్యిను మనస్పూర్తిగా తీసుకోవచ్చు అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: