దక్షిణ భారతదేశంలో ఎక్కువగా పండే పండ్లలో పనసపండు కూడ ఒకటి. మండు వేసవికాలంలో తియ్యదనానికి చిరునామాగా ఉండే ఈ పనసపండు తొనలను తినేందుకు ఆసక్తిని కనపరచని వారు ఎవ్వరు ఉండరు. సాధారణంగా ఈపండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్లకన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు మనకు అందిస్తుందని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఈ పనసపండులో ఎన్నో పోషకాలు ఉన్న నేపధ్యంలో ఈ పండు తొనలు మన శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను నయంచేయడంలో ఈ పనస తొనలు సహాయం చేస్తాయి. 
పనస పండ్ల తొనలు ఫోటోలు కోసం చిత్ర ఫలితం
పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు క్యాన్సర్ రాకుండా చూస్తుంది.పనస తొనలు తినే అలవాటు టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వయస్సు పెరగడంతో చాలమందికి  చర్మంపై ముడతలు రావడం సహజంగా  కనిపించే పరిణామం. 
పనస పండ్ల తొనలు ఫోటోలు కోసం చిత్ర ఫలితం
అయితే పనస పండును తరచూ తినేవారికి ముడతలు ఏర్పడకుండా చర్మం మంచి కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. పనస పండ్లులోని తొనలు  బాగా తియ్యగా  ఉన్నప్పటికే  షుగర్ లెవల్స్‌ను పెంచవు అన్న విషయానికి ప్రామాణికంగా వీటిలో ఉండే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి అని చెపుతున్నారు. దీనితో ఈపండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయన్న భయం చెందాల్సిన అవసరంలేదు అని లేటెస్ట్ అధ్యయనాలుచెపుతున్నాయి. 
పనస పండ్ల తొనలు ఫోటోలు కోసం చిత్ర ఫలితం
పనస పండ్లలో విటమిన్ ఎ-సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న పనస కాయలను పండకుండా పచ్చిగా ఉన్నప్పుడు రకరకాలయిన  కూరలుగా మనం తినే ఆహారంలో ఉపయోగించుకునే అలవాటు ఎప్పటినుంచో  ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: