మండిపోతున్న ఈవేసవికాలంలో  దాహాన్ని తీర్చి  మనసరీరంలో ఉత్తేజాన్ని నింపడానికి పుచ్చకాయ జ్యూస్ కి మించినదిలేదు అని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది బరువు తగ్గించడానికే కాక శరీరంలో మలినాలను బయటకు నెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో డయూరిటిక్ లక్షణాలు ఉన్నందున మూత్రపిండాలను మరియు మూత్రాశయమును శుద్ధి చేస్తుంది అని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. 
కివీ-పుచ్చకాయ జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
ఈపుచ్చకాయ జ్యూస్ వల్ల శరీరంలో పేరుకున్న విషతుల్య పదార్థాలను నెట్టియడంలో కీలకంగా పనిచేస్తుందని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండటం వలన ఇది అనేక శారీరక రుగ్మతలతో పాటు మలబద్దకం నిరోధించడంలో చాల కీలకంగా ఈ పుచ్చకాయ జ్యూస్ పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 
తయారీ విధానం:
పుచ్చకాయలో  కేలరీలు ఎక్కువగా ఉండవు. దీనిలో నీటి శాతం అధికంగా ఉండటంతో  పాటు ఎటువంటి కొలెస్ట్రాల్ కొవ్వు లేకపోవడంతో పుచ్చకాయ ముక్కలను తిన్న వెంటనే  అది మన కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలలో ఎటువంటి కొవ్వు లేకుండా 80 కెలరీలు ఉంటాయి. దీనితో పాటు ఒక గ్రాము పీచుపదార్ధం ఉండటం వలన ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలుగు తుంది. 
పుచ్చకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
 పుచ్చకాయలు కండరాల బాధలను శాంతపరుస్తాయని కూడా పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ కెమిస్ట్రీ వారి అధ్యయనం ప్రకారం, పుచ్చకాయను తినడం వలన కండరాల నొప్పి మందగిస్తుంది అని కూడా చెపుతున్నారు.  అంతేకాదు ఈ పుచ్చకాయ వల్ల మనసరీరంలోని శరీరంలో రక్తప్రసరణ మెరుగు పడి    రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈపుచ్చకాయ ముక్కలను ఈ మండు వేసవిలో ఎన్నసార్లు తింటే అత ప్రయోజనం అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: