తలకు మించిన పని భారంతో స్త్రీలు పురుషూలూ అధికంగా ఒత్తిడికి గురవుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నారుు. ఈ ఒత్తిడి తెచ్చే అనర్థాలు అనేక ఇబ్బందులను కలిగిస్తున్నట్లు కూడా ఇవి వెల్లడిస్తున్నారుు. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకూ కారణం మానసిక ఒత్తిడేనని పరిశోధనల్లో తేలింది. వీటిని తరిమికొట్టి ఉల్లాసంగా గడపడానికి మంచి మార్గం ఒకటుంటుందంటున్నారు వైద్యులు.

అదే హాస్య యోగా..!

హాస్య యోగా చేసేవారిలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరు తుంది. మెదడుకు ప్రాణవాయువు సరఫరా మెరగవుతుంది. శరీరం లోపలి అవయవాల పనితీరు చురుకుగా మారుతుంది. కను క రోజులో సాధ్యమైనంత వరకు ఎక్కువగా పగలబడి నవ్వమని హాస్యయోగా వైద్య నిపుణులు చెబుతున్నారు.


కార్యాలయాల్లో...
నేడు చాలా కార్యాలయాల్ల పనిచేసే ఉద్యోగులు కనీసం 10 నుంచి 15నిమిషాలు సమయాన్ని కూడా నవ్వడానికి కేటాయించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీని వల్ల వారిలో ఒత్తిడి అధికమవుతున్నట్లు పరిశోధకులు గమనించారు. కొందరు నవ్వడానికి అవకాశం వచ్చి నా కూడా మూతి ముడుచుకుని కూర్చుంటున్నారని తమ అధ్య యనంలో తేలిందని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: