నల్లద్రాక్షలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వల్ల వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అంతేకాకుండా నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తుంది. ఇది గుండెపోటు నివారణకు ఎంతో దోహదపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
సౌందర్యాన్ని కూడా అందిస్తాయి
నల్లద్రాక్షలో ఉన్న పోషకాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా సౌందర్యాన్ని కూడా అందిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ద్రాక్షలో ఉండే పాలిఫినాల్స్‌ శరీరంలోని కొల్లాజిన్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నల్లని ద్రాక్ష చర్మానికి నిగారింపు తెస్తుంది అని బ్యూటీషియన్స్ కూడ అంగీకరిస్తున్నారు. 
ఏకాగ్రత పెరుగుతుంది
ముఖ్యంగా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించి చర్మానికి జీవకళను తెచ్చిపెట్టడంలో నల్ల ద్రాక్ష సహాయ పడుతుంది. ఒక విధంగా జుట్టుకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు మంచి పోషణనిస్తాయి. నల్లద్రాక్ష రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. చదువుకునే పిల్లలకు వీటిని తరుచూ తినిపిస్తూ ఉంటే వారిలో ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది అని అంటున్నారు. 
కొవ్వు పట్టకుండా
వీటిలోని ఫైటో కెమికల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.  బరువు తగ్గాలనుకునే వారికి కూడా నల్ల ద్రాక్ష చాలా మంచిది అని వైద్యులు చెపుతున్నారు. నల్లద్రాక్ష శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపి కొవ్వు పట్టకుండా చూస్తాయి. మధుమేహం ఉన్నవారు ద్రాక్ష తీసుకోకూడదని చెబుతారు. కానీ నల్లద్రాక్షకు రక్తంలోని చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచే శక్తి ఉంది అని అధ్యయనాలు చెపుతున్న నేపధ్యంలో డయాబిటిక్ వ్యాధిగ్రస్తులు నల్లద్రాక్షను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అని అంటున్నారు. ఇలా అనేకరకాల ప్రయోజనాలు ఉన్న నల్లద్రాక్షను పిల్లలకు తినడం అలవాటుగా మారిస్తే వారికి జ్ఞాపశక్తితో పాటు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: