ఒకసారి ఒక పిరికివాడు ఒక స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి...కొంచెం దూరంలో ఒక వ్యక్తి వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు... ఇంతకీ విషయం ఏమిటంటే..ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడు...కాని కేవలం వాడికి వీడు..వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

Image result for confidence image

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే... నేను ఉన్నాను అనే భరోసా...ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్న అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో..ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

Image result for confidence image

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారు అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో మేము ఉన్నాం అనే భరోసా కారణం...కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం.

చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు..బంధువులు నీ చుట్టూ లేక పోవటం... కష్టంలో మనిషికి నేనున్నా  అనే భరోసా ఇద్దాం...అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి


మరింత సమాచారం తెలుసుకోండి: