ఆయుర్వేద వైద్య శాస్త్రంలో బెల్లం వాడకానికి విపరీతమైన ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేద వైద్యులు ఇస్తున్న సలహాల ప్రకారం ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తినడం వలన రక్త శుద్ది జరిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని తెలుస్తోంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. 
తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లే వేసుకుంటే
ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు చిన్న పరిమాణంలో బెల్లం తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. బెల్లంలో మన శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కూడ ఈ బెల్లం వలన కరిగిపోతుంది. 
బెల్లం తినడం వల్ల
ప్రతిరోజు మద్యాహ్నం రాత్రి భోజనం అయ్యాక కాస్త బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. కీళ్ల నొప్పుల బాధల నుండి కూడ విముక్తి పొందడం జరుగుతుంది.  అంతేకాదు బెల్లం క‌లిపిన పాలు తాగుతుంటే ర‌క్త హీన‌త స‌మ‌స్య ఇట్టే పోతుంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. 
బెల్లం, నెయ్యి కలిపి
దీనితో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు మన దరికి చేరావు. అదేవిధంగా బెల్లం పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి క‌చ్చితంగా ప్రతి రోజూ వీటి కాంబినేష‌న్ తో బెల్లం కలుపుకున్న పాలు త్రాగితే మంచిది అని వైద్యులు సలహాలు ఇస్తున్నారు. ఒక గ్లాసు నీటిలో బెల్లం కలిపి, అందులో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈవిధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ బెల్లం పాల మిశ్రమం తీసుకోమని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: