ఆధునిక జీవనశైలి కారణంగా మనిషి తనపై తాను నియంత్రణని కోల్పోయాడు. చదువు ఒత్తిడిల వల్ల కావచ్చు, కుటుంబ ఒత్తిడిల వల్ల కావచ్చు, ఉద్యోగ ఒత్తిడిలు కావచ్చు ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ అధిక ఒత్తిడికి లోనయి తమ ఏకాగ్రతను, సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. తగిన సరైన వ్యాయామం చేయడం కానీ, యోగా కానీ చేయకుండా లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటున్నారు. దంపతులు సైతం శృంగార జీవితాన్ని సుఖంగా గడపకుండా వారి శృంగార ఆసక్తిని, సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. 


దంపతులకు శృంగారం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, వారి రోజు వారీ ప్రణాళిక క్రమబద్ధంగా లేక అనుకున్న విధంగా శృంగారాన్ని  ఎంజాయ్ చేయక అసంపూర్తిగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారు ఎటువంటి ఖర్చుచేయకుండానే కేవలం యోగాతో వారి సమస్యలను అధిగమించి సుఖవంతమైన మరియు సంపూర్ణమైన శృంగారాన్ని పొందవచ్చు.


యోగా శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది. యోగా అనేది భాగస్వామితో కలయికలో చురుగ్గా పాల్గొనడానికి ఒక ఔషధంలా ఉపయోగపడుతుందట. అయితే ఈ యోగాలో భాగస్వామితో సుఖవంతమైన శృంగారం పొందడానికి యోగాలో పద్మాసనమే కీలకం అనునది యోగా నిపుణుల భావన. పద్మాసనం ఏకాగ్రతను పెంచడంలో దోహదపడుతుంది కాబట్టి దంపతులిద్దరూ ఈ తరహా యోగా చేయాలనేది యోగా నిపుణుల సూచన. 


శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే మరొక ముఖ్యమైన యోగాసనం ప్రాణాయమం. దీనివల్ల శరీరం, మనసు నియంత్రణలో ఉండటమే కాకుండా కావలసినంత శృంగార సామర్థ్యం వస్తుంది. యోగాసనాలలో బేసిక్స్ గా భావించే  సూర్యనమస్కారం మరియు వజ్రాసన ఆసనాలు సైతం ఏకాగ్రతను పెంచుతాయి. ధనురాసన, ,సర్వాంగాసనం వంటి  యోగాసనాలతో మంచి ఫలితం ఉంటుంది కానీ ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: