ప్రస్తుత సీజన్ లో మనకు మార్కెట్ లో నేరేడు పండ్లు మ‌న‌కు విరివిగా దొరుకుతాయి. నిగనిగలాడుతూ నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం వలన మన ఆరోగ్యానికి ఎంత మంచి కలుగుతుందో తెలుసుకుంటే ఎవరైనా సరే నేరేడు పండ్లను తిన‌డం మానరు. 

నేరేడు పండ్లలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లకు కూడ ఈ నేరేడు పండ్లు వల్ల పరిష్కారం దొరుకుతుంది. నేరేడు పండ్ల‌లో  నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు లభిస్తాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి తావడమే కాకుండా డ‌యబెటిస్ నియంత్ర‌ణ‌లో నేరేడు పండ్లు కీలక పాత్రను పోషిస్తాయి. వీటిలో ఉండే ఔష‌ధ గుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో నేరేడు పండ్లు బాగా సహకరిస్తాయి అని అంటారు. 

రక్తహీనత సమస్యను  ఎదుర్కొంటున్న వారు ఈ పండ్ల‌ను ఎంత తింటే అంత మంచిది. దీనికితోడు చిగుళ్ళ సమస్యలు ఉన్నవారు ఈ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల సమస్యలు తీరుతాయని దంత వైద్యులు కూడ చెపుతున్నారు. నేరేడు పండ్లలోని రసం బ్యాక్టీరియాను దూరం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నఈపండ్లను  ఈ కాలంలో ఎక్కువగా తినడం అలవాటు చేసుకుంటే మనకు ఆరోగ్యంతో పాటు వైద్యం పై పెట్టి డబ్బు కూడ ఆదా అవుతుంది మరియు అన్నిరకాల మేలు..   


మరింత సమాచారం తెలుసుకోండి: