ప్రస్తుతం మనలో చాలామంది మనకు తెలియకుండానే విషాన్ని మింగుతున్నామని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మనం నమ్మలేని కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. మనకు తెలియకుండా రుచి కోసం మనం ప్రతిరోజు తినే ‘మోనో సోడియం గ్లూటమేట్’ వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయి అని అంటున్నారు. దీనినే టేస్టింగ్ సాల్ట్ అని కూడ పిలుస్తారు. 
Monosodium Glutamate 30-40 Mesh
ఈ సాల్ట్ ను ప్రస్తుతం ప్రముఖ హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బ్యాకరీలలో తయారు చేసే పదార్ధాలలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సాల్ట్ వల్ల మనం తినే ఆహార పదార్థాలకు మంచి రుచి వస్తుందని ఈ సాల్ట్ తెగ వాడుతున్నట్లు సమాచారం. ఈసాల్ట్ తక్కువ మొత్తంలో మన శరీరంలోకి చేరితే సమస్య లేదు కానీ ఎక్కువ మొత్తంలో ఈ సాల్ట్ మన శరీరంలో చేరితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అంటున్నారు. 

ఈ సాల్ట్ వల్ల ఊబకాయానికి గుర్వడమే కాకుండా పలు మెటబాలిక్ సమస్యలు వస్తాయి. ఈ సాల్ట్ వల్ల హార్మోన్ల అసమతుల్యత, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు వస్తున్నాయి. ఈ సాల్ట్ కలిసి ఉన్న పదార్ధాలను అతిగా తినే వారికి మన నాలుకపై ఉండే రుచి కళికలు మరింత ప్రభావితం అయి ఈ ఆహారాన్ని అతిగా తిని బరువు పెరిగే ఆస్కారం ఉంది.
Monosodium Glutamate ( Msg), Usage: Food Industry
ఈ సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకున్న వారికి హైబీపీ, డయాబెటిస్, కండరాలు ముడుచుకుపోవడం, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు వస్తుంటాయి. సాధారణంగా ఈసాల్ట్ ను ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువగా వేస్తుంటారు. అలాగే సాస్‌లు, చిప్స్, ప్రిపేర్డ్ సూప్స్, హాట్ డాగ్స్, బీర్లు, క్యాన్డ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ వేస్తారు. కనుక ఇలాంటి తినేటప్పుడు వాటి లేబుల్‌పై ఎంఎస్‌జీ లేదా మోనో సోడియం గ్లూటమేట్ ఎంత ఉందో వెరిఫై చేసుకుని తినాలి అని వైద్యులు సూచనలు ఇస్తున్నారు. ఏదైనా రుచిగా ఉందని అతిగా తింటే ప్రమాదమే అన్న విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: