ఆకు కూరలు వల్ల మనకు సమకూరే అనేక ప్రయోజానాల గురించి అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. అయితే ఈఆకు కూరలలో మెంతి కూరతో సమకూరే ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరు ఈ కూరను వదిలి పెట్టరు. మన శరీరానికి సంబంధించిన అనేక  అనారోగ్య స‌మ‌స్య‌లు నయంచేయడంలో ఈమెంతి కూర కీలక పాత్ర పోషిస్తుంది.  మన  శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందివ్వడంలో ఈమెంతి కూర చేసేమేలు మరి ఏ ఆకు కూర చేయదు అని అంటారు.  

ముఖ్యంగా లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది.  మన లివ‌ర్‌ ను ఇది శుభ్రం చేయడమే కాకుండా గ్యాస్ పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలిగించడంలో ఈమెంతి కూర ఎంతో కీలకంగా అని చేస్తుంది. అదే విధంగా శ్వాసకోశ సమస్యలు పరిష్కరించడంలో ఈమెంతి కూర ఎంతగానో సహాయ పడుతుంది అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 

మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌ పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు  కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈమెంతి ఆకులు నిర్వర్తించే పాత్ర మరి ఏఆకు కూడ చేయలేదు అనే పరిశోధనలు కూడ ఉన్నాయి. మంచి కొలెస్ట్రాల్‌ ను పెంచడంలో  మెంతి ఆకులను కొంత నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆనీటిని వడకట్టి తాగితే చక్కని ఫలితహలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉన్న మెంతి కూర వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాల చురుకుగా పని చేయడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్‌ ను నియంత్రించడంలో ఇది చాల కీలకంగా పని చేస్తుందని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. 

 దీనికితోడు  హార్ట్ అటాక్ ఇతర గుండె సంబంధ వ్యాధులు రాకుండా  మెంతి కూర చేసేమేలు గురించి అనేక పరిశోధన వ్యసాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతి కూర బాగా ఉపయోగపడుతుంది.   దీనికితోడు మెంతి ఆకులను పేస్ట్‌గా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుందని కాస్మోటిక్ వైద్యులు చెపుతున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ మెంతి కూరను తినడం అన్ని విధాల శ్రేయస్కరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: