ముత్యాల్లాంటి తెల్లని పళ్ళు ఉండేవారి నవ్వులో ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. మన పళ్ళరంగు మారిపోవటానికి చాలా కారణాలు ఉన్నట్లుగానే   ఆపళ్ళను తెల్లగా మెరిసేలా చేయటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే పళ్ళను తెల్ల పరచడానికి సహజమైన పద్ధతుల్లో ఒకటి అరటితొక్కను వాడటం. ఈ విషయం వింటే ఎవరికీ నమ్మకం కలిగించే విషయంకాకపోయినా ఇది నిజం అని అంటున్నాయి లేటెస్ట్ అధ్యయనాలు. 
పళ్లను తెల్లబర్చటానికి అరటితొక్క ఎలా తెలివైన ఇంకా సులభమైన చిట్కాగా మారింది?
సాధారణంగా కాఫీ, కోలాలు, టీ,ఆల్కహాల్ ఇంకా ఆపిల్స్, బంగాళదుంపల వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే పళ్ళ పై మచ్చలు పడతాయి. పొగాకునమలడం లేదా పొగతాగటం వలన కూడా పళ్ళ రంగుపోతుంది. కొన్ని రకాల మందులతోపాటు క్లోరైడ్ ఉన్న కొన్ని మౌత్ వాష్ ల వలన కూడ పంటిపై మచ్చలు వస్తాయి. 
How To Get White Sparkling Teeth Using Banana Peel
అయితే అరటితొక్కలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి6,విటమిన్ బి12 వంటి పోషకాలు ఉన్న నేపధ్యంలో ఆ అరటి తొక్కలోని గుజ్జును మన పళ్ళ పై రెండు నిముషాలు రుద్దితే దానివల్ల మన పళ్ళకు మెరుపు వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఈ పద్ధతిని అనుసరిస్తూ రెండు వారాలు క్రమం తప్పకుండ ప్రయత్నాలు చేస్తే మన ముత్యాలులా మెరిసి పోవడం ఖాయం అని అంటున్నారు. 
పళ్ళపై అరటితొక్కలను ఎలా వాడతారు?
అంతేకాదు ఈ పద్ధతి అతి సురక్షతమైనది మాత్రమే కాకుండా మన దంతాలకు ఎటువంటి హాని జరుగదు అని ఆయుర్వేద డాక్టర్లు చెపుతున్నారు. అదేవిధంగా అత్యంత ఖరీదైన కాస్మెటిక్ వైద్యంకన్నా ఇది చాల సురక్షితమైన విధానం. అదేవిధంగా అరటితొక్కల్లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల వలన మొటిమలు పోతాయి, ముడతలు తగ్గుతాయి, చర్మానికి తేమ అందుతుంది. అరటితొక్క లోపలిభాగాన్ని సింపుల్ గా చర్మంపై రుద్దితే చర్మం కాంతివంతంగా మారుతుంది. అందువల్ల తొక్కే కదా అని పాడేయకుండా ఈ అరటి తొక్కను కూడ ఉపయోగించుకోమని చెపుతున్నారు వైద్యులు..   


మరింత సమాచారం తెలుసుకోండి: