ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం ద్వారా అనేక వ్యాధుల నుంచి  రక్షించుకోవచ్చు అన్న అవగాహన ఇప్పడు చాలా మందికి పెరిగి పోవడంతో వ్యాధులు వచ్చాక వైద్యం చేయించుకునే కంటే ముందుగా అసలు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తెసుకునే విషయాల పై చాలమంది ఆసక్తి కనపరుస్తున్నారు. ఈనేపధ్యంలో ప్రతిరోజూ బార్లీ వాటర్ తీసుకోవడం వాలా అనేక ప్రయోజనాలు పొందడంతో పాటు మానవ శరీరంలోని కిడ్నీకి ఎటువంటి అనారోగ్యం రక్షించు కోవచ్చు అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 
health tips in telugu
శాస్త్రవేత్తలు అలాగే పరిశోధకులు బార్లీ వాటర్ లోని ప్రయోజనాలను అదేవిధంగా ఔషధ గుణాలను వెలికితీసి ఈ వాటర్ లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్న విషయమై చాలామందికి తెలియని విషయాలు తెలియచేస్తున్నారు. బార్లీలో అనేక రకాల వ్యాధులను అరికట్టే ఔషధ గుణాలు ఉన్నాయి.  ఆస్త్మా, ఒబెసిటీ, ఆర్తరైటిస్, అనీమియా, ఇంపొటెన్సీ వంటి సమస్యలను ఇది తగ్గించగలదని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు.  
health tips in telugu
ఇందులో విరివిగా ఉండే  పోషకాలు పుష్కలంగా ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్  వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈవాటర్ ను ప్రతిరోజు తీసుకునేవారికి కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి విముక్తిని పొందవచ్చు.  ఈ విషయాన్ని ఆలోపతి వైద్యులు కూడ తమ పేషంట్స్ కి సూచిస్తున్నారు. బార్లీ వాటర్ అనేది సహజసిద్ధంగా లభించే హెల్త్ బూస్టర్ అవడంతో హార్ట్ ప్రాబ్లెమ్ డయాబెటిస్ వంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇది రక్షణనుకలిగిస్తుంది.  
health tips in telugu
దీనిని రోజూ డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ యూరినరీ ప్రాబ్లమ్ల నుండి కూడ ఉపసమనం పొందవచ్చు అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా  కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి మినరల్ డిపాజిట్స్ అనేవి ప్రధానకారణంగా కారణంగా కనిపిస్తున్న నేపధ్యంలో బార్లీ వాటర్ అనేది టాక్సిన్స్ ను అలాగే బేబీ క్రిస్టల్స్ ను యూరిన్ ద్వారా బయటికి పంపడంలో సహకరిస్తుంది దీనికితోడు. బార్లీ నీళ్లు అనేది హెల్త్ డ్రింక్ కాబట్టి ఇది బ్లాడర్ పై ప్రెషర్ నికంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది.  బార్లీ నీళ్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న నేపధ్యంలో  యూరిన్ లో కేల్షియం కంటెంట్ యొక్క విసర్జనను తగ్గిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ బార్లీ వాటర్ ను తీసుకోవడం వేసవిలో మరింత మేలును చేకూరుస్తుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: