ప్రస్తుతం మనం రోజు తినేకూరలలో పచ్చి బఠానీలు లేకుండా వండటం జరగడం లేదు. చక్కని రుచిని కలిగిఉన్న వీటిని రకరకాల కూరలతో కలుపుకుని వండె ఎన్నో రకాల పద్దతులు ఉన్నాయి. అయితే ఈపచ్చి బఠానీలను కేవలం రుచికి మాత్రమే కాకుండా వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాడితే మంచిది అంటూ వైద్యులు కూడ  సలహాలు ఇస్తున్నారు. 

పచ్చి బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాలను నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చూస్తాయి. దీనితో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మేలు చేస్తుందని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. అంతేకాదు పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ శరీర జీర్ణవ్యవస్థను పటిష్టం చేసి జీర్ణశక్తిని పెంచుతుంది అని అనేక అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.

వీటిల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల గర్భిణీలు పచ్చిబఠానీలను బాగా తింటే పుట్టబోయే బిడ్డకు పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది అని డైటీషీయన్స్ చెపుతున్నారు. అదేవిధంగా గాయాలు దెబ్బలు తగిలిన వారు పచ్చి బఠానీలను తింటే ఆగాయాలు త్వరగా మానిపోతాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్‌ ల వల్ల గాయాలు త్వరగా మానేలా పరిస్థుతులు ఏర్పడతాయి.  

పచ్చి బఠానీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వల్ల క్యాన్సర్‌ వ్యాధి వచ్చే ప్రమాదం కొంతవరకు నివారించవచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును తగ్గించడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వీటిని కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజలు రకరకాల వంటలలో ఉపయోగిస్తున్నారు అంటే వీటి ప్రాముఖ్యత నేడు ఎంత పెరిగిపోయిందో అర్ధం అవుతుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: