ఎరుపురంగుతో కనిపిస్తూ చూడగానే ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లను చాలామంది తింటూ ఉంటారు. అయితే వీటివెనుక ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా వీటిని మరింత ఎక్కువగా తింటారు. కేవలం రుచికి మాత్రమే కాకుండా అనేక పోషకాలు ఈపండ్లలో ఉన్నాయి. ఈ పండ్లను తేనే అలవాటు చేసుకోవడంవల్ల పలు అనారోగ్య సమస్యలను సులభంగా నయం చేసుకోవచ్చు అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.  

చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా మన శరీరానికి ఇన్‌ ఫెక్షన్లు రాకుండా సహకరించడమే కాకుండా చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిన్ మన శరీరంలోని నొప్పులు వాపులను తగ్గించడంలో ఎంతగానో ఈపండ్లు సహకరిస్తాయి. చెర్రీ పండ్లలో ఆంథోసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల మనశరీరానికి తరుచు వచ్చే కీళ్ల నొప్పులు  కూడ తగ్గిపోతాయి.
cherry, cherry farm, cherries, upick, pick, fruit, victoria
చెర్రీ పండ్లలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉన్న నేపధ్యంలో మన రక్తంలో ఉండే చెడు కొలస్ట్రాల్‌ ను తగ్గించడంలో సహాయ పడతాయి. ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా ఈ పళ్ళు అమోఘంగా పనిచేస్తాయని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. చెర్రీ పండ్లలో పుష్కలంగా ఉండే మెలటోనిన్ చాలామందిని తరుచు పీడించే నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి.    చెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఎక్కువగాఉన్న నేపధ్యంలో ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఎంత గానో సహకరిస్తాయి.  
Cherry Tree 'Sunburst'
దీనితో వయస్సు మీద పడడం కారణంగా వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అని అలో పతి వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. ఇక ఈ  చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలనుపరిష్కారానికి ముఖ్యంగా మలబద్దకం సమస్య నుండి బయటపడేలా చేస్తుంది. లేటెస్ట్ అధ్యయనాలు ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు కూడా చెర్రీ పండ్లను నిర్భయంగా తినవచ్చుఅని చెపుతున్నారు. వీటిలో ఉండే ఆంథోసయనిన్స్ మన శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ఇలా ఈపండ్ల ప్రయోజనాల గురించి అనేక వార్తలు వస్తున్న నేపధ్యంలో అందరు ఏమాత్రం వీలు ఉన్నా ఒక  గుప్పెడు చెర్రీ పండ్లును ప్రతిరోజు తినడం మంచిదని డైటీషియన్స్ చెపుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: