ప్రస్తుతకాలంలో మన శరీరంలో ఏర్పడే ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీ బయోటిక్స్ ను వేసుకోవడం అన్నది ఒక అలవాటుగా మారిపోయింది. మన శరీరంలోని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో యాంటి బయోటిక్స్ పోరాడుతాయి అన్న నమ్మకం మనకు ఉన్నా వీటివల్ల మన లివర్ పనితీరు దెబ్బతింటుంది అన్న మాటలు కూడ వినిపిస్తాయి. 
1. పెరుగు:
దీనితో మనం రకరకాల కారణాల కోసం వినియోగించే యాంటి బయోటిక్స్ తో పాటు మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్ధాలను తప్పకుండా తీసుకుంటే యాంటి బయోటిక్స్ వల్ల జరిగే నష్టం నివారించవచ్చు అని కొన్ని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా పాలు ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా పెరుగుగా రూపాంతరం చెందుతున్న నేపధ్యంలో ఈ పెరుగుప్రతిరోజు తీసుకోవడం వల్ల యాంటి బయోటిక్స్ వల్ల జరిగే నష్టాలు కొంత వరకు అరికట్టవచ్చు అని డాక్టర్లు కూడ అంగీకరిస్తున్నారు. 
2. వెల్లుల్లి:
అదేవిధంగా మనం తరుచు వంటలలో ఉపయోగించే వెల్లుల్లి అనేది మరొక ప్రీబయోటిక్ ఫుడ్. యాంటీ బయోటిక్స్ కోర్స్ ను వాడిన తరువాత వీటిని కూడ మన ఆహార మూడు పెద్ద వెల్లుల్లి రెబ్బల నుంచి దాదాపు రెండు గ్రాముల ప్రీబయోటిక్స్ అందుతాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాలను మన శరీరంలో వ్యాపింప చేయకుండా పోరాడే శక్తి ఈ వెల్లుల్లికి ఉంది.  
3. బాదాం:
అదేవిధంగా మరొక లేటెస్ట్ అధ్యయనం ప్రకారం బాదాంలలో కోల్డ్ మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడే శక్తి ఉందని తేలింది. యాంటీ బయోటిక్స్ ను వాడటం వలన గట్ బాక్టీరియాపై దుష్ప్రభావం పడుతుందని చాలామంది చెపుతున్న నేపధ్యంలో ఫైబర్ అధికంగా కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన గట్ బాక్టీరియా తిరిగి ఆరోగ్యకరమైన స్థాయికి చేరుకుంటుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్న ఈ ఆహార పదార్ధాలను మనం యాంటి బయోటిక్స్ వాడినప్పుడల్లా తీసుకుంటే మనకు ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: