భోజనం చేసాక టీ తాగడమనేది ఒక అలవాటుగా చేసుకున్న వారు చాలమంది ఉన్నారు. అయితే ఇలాంటి అలవాటు మంచిదా కాదా అనే విషయం పై భిన్నా భిప్రయాలు ఉన్నాయి. లేటెస్ట్ అధ్యయనాల ప్రకారం టీ తాగితే జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుందని చాలామంది చెపుతున్నారు. ఈ అలవాటు వల్ల కెఫిన్ పోషకాలను మన శరీరం గ్రహించకుండా సహాయపడటమే కాకుండా ఈ అలవాటు వల్ల కడుపులోని అపాన వాయువులు మరియు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది అన్నఅభిప్రాయం చాలమంది వ్యక్త పరుస్తున్నారు. 
Is it better to drink tea after meals?
అయితే ఇలాంటి ప్రయోజనాలు సాధారణ టీ తీసుకోవడం వల్ల లభించవు కేవలం హెర్బల్ టీ లేదా గ్రీన్ టీలు తీసుకునే వారికి ఇందులో అధిక మొత్తంలో పాలీఫీనాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన అవి జీర్ణానికి తోడ్పడతాయి అనిఅధ్యయనాలు తెలియచేస్తున్నాయి.  అంతేకాదు గ్ర్రెన్ టీ లేదా హెర్బల్ టీలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి అని పాశ్చత్య పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 
Is it better to drink tea after meals?
ఇలాంటి ప్రయోగాను హెర్బల్ టీ ద్వారా పొందాలి అని భావించే వారు విటమిన్ సి మరియు ఐరన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నపుడు మాత్రమే ఈఫలితాలు ఉంటాయని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అయితే  భోజనం చేసాక టీ తాగితే శరీరంలో కెటచిన్స్ లభ్యత తగ్గిపోతుందని ఆహార మార్గదర్శకాల కమిటీ కన్వీనర్ డాక్టర్ డి. రఘునాథరావు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసారు.
Is it better to drink tea after meals?
వాస్తవానికి కాఫీ టీలను తీసుకోవడం వల్ల అలసట తగ్గడం కండరాలు నొప్పి తగ్గడం వంటివి జరుగుతాయి అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నా వీటిని తీసుకునే అలవాటు మితిమీరి ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్న అభిప్రాయాన్ని ఇప్పటికీ వైద్యులు అంగీకరిస్తున్నారు. అయితే ఈ హెర్బల్ టి అలవాటు మితంగా ఉంటే మన గుండె పనితీరుని సక్రమంగా చేయడంలో తన వంతు పాత్ర నిర్వర్తించడమే కాకుండా ముఖ్యంగా మన జీర్ణశక్తి పెంపుదల విషయంలో హెర్బల్ టితో పాటు అల్లం టి అందించే ప్రయోజనం సాధారణ మందులు కూడ అందించలేవు అన్న అభిప్రాయాన్ని చాలామంది వైద్యులు కూడ అంగీకరించే విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: