భారతీయ సంస్కృతిలో తాంబూలానికి ఒక ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉంది. వివిధ రకాల దినుసులను వక్కపొడితో కలిపి తయారుచేసే పాన్ ప్రస్తావన లేకుండా మన దేశంలో శుభకార్యాలు పూర్తి కావు. దీనికితోడు మనదేశంలో పాన్ ను తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది అనడంలో ఎటువంటి సందేహాలు లేవు.   

పాన్ తయారీలో సాధారణంగా సున్నం తమలపాకు యాలకులు దాల్చినచెక్క మరియు టొబాకోలను వినియోగించినా వక్కపొడి అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఒక్కపొడి వల్ల అనేక అనర్ధాలు వస్తాయని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం పాన్ తయారీలో వాడే పదార్థాలలో యాలకులు అలాగే దాల్చినచెక్క తప్పించి మిగిలినవన్నీ క్యాన్సర్ కి దారితీస్తాయి. వీటిలో వక్కపొడి ముందు స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని ఆసంస్థ తన అధ్యయనంలో తెలియచేసింది.  

కొన్ని అధ్యయనాల ప్రకారం వక్కపొడిని తరుచూ తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని కూడ చెపుతున్నారు. అదే విధంగా తరుచు వక్కపొడిని నమలడం వలన గమ్ ఇరిటేషన్ తో పాటు టూత్ డీకే సమస్యలు కూడ వస్తాయి. ఈ అలవాటు వల్ల ఏర్పడే  కెమికల్ రియాక్షన్ వలన దంతాలు శాశ్వతంగా ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారిపోయే ప్రమాదం ఉంది. 

అంతేకాదు వక్కపొడి శరీరంలో అనేక టాక్సిక్ రియాక్షన్స్ కు దారితీస్తుంది. మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. వక్కపొడిని తరచూ తీసుకోవడం వలన అడిక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. అని కూడ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఇన్ని దుష్ ప్రభావాలు ఉన్నాయి అని తెలిసినప్పటికీ వక్కపొడి అలవాటును మానుకోలేక అనేకమంది సతమతమవుతున్న నేపధ్యంలో ఈఅలవాటు వల్ల జరిగే నష్టాలను సవివరంగా వివరించడం మంచిది అని అనేకమంది వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: