మనం ప్రతిరోజు తాగేందుకు గేదెపాలు-ఆవుపాలు రెండూ అందుబాటులో ఉన్నప్పటికీ మనలో చాలామంది గేదెపాలను మాత్రమే ఇష్టపడతారు. అయితే ఇప్పుడు చాలమందికి సమస్యగా మారిన అధిక బరువును తగ్గించుకోవడంలో ఆవుపాలు చేసేమేలు తెలిస్తే ఎవరు ఆవుపాలను వదిలిపెట్టరు. అదేవిధంగా ఆవుపాలను రోజు త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయాన్ని మన పూర్వీకులు మాత్రమే కాకుండా లేటెస్ట్ అధ్యయనాలు కూడ తెలియచేస్తున్నాయి. 

ఆవుపాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది  కాబ్బట్టి   ఈ ఆవుపాలు అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలుచేస్తుంది. ముఖ్యంగా డైట్ ప్లాన్‌ లో ఉన్నవారు ఆవుపాలను తీసుకోవడం మంచిది అన్న విషయం వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. అదే విధంగా జీర్ణాశయ సమస్యలను తొలగించడంలో ఆవుపాలు ఎంతగానో మేలు చేస్తాయి. 

ప్రతిరోజూ ఆవుపాలను తాగుతూ ఉంటే జీర్ణాశయం బలంగా తయారవుతుంది. ఆవుపాలలో కొద్దిగా కుంకుమపువ్వు చక్కెరను కలిపి తీసుకుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆవుపాలలో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు రాకుండా సహకరిస్తుంది.  అలేగే ఈఆవు పాలు ప్రతిరోజు తీసుకునే వారిలో  రోగనిరోధక శక్తి కూడ బాగా  పెరుగుతుంది.
 
ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెంచే విషయంలో ఆవుపాలు బాగా సహకరిస్థాయి అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దీనితో చదువులలో రాణించాలి అని అభిప్రాయపడే విద్యార్ధులకు  ఈ ఆవుపాలు తీసుకోవడం ఎంతో మంచిది అని చెపుతున్నారు.  ఆవుపాలలో కాల్షియం, మెగ్నిషియంలు పుష్కలంగా ఉన్న నేపధ్యంలో సంపూర్ణ ఆహారంగా ఆవుపాలు కీలకపాత్రను పోషిస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఆవుపాలను ఆ హారంగా స్వీకరించే వారిలో సాత్విక గుణాల పెంపుదల పెరిగి మనిషిలో నేర ప్రవృత్తి తగ్గి ఆధ్యాత్మిక పెరుగుతుందని మన ఋషులు ఎప్పటి నుంచో చెపుతున్న నిజం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: