ఇప్పటి వరకు చాక్లెట్స్ ఎక్కువగా తినేవారికి బరువు చాల పెరిగి పోతుంది అన్న భావనలో చాల మంది చాక్లెట్స్ తినేవారు కాదు. అయితే దానికి భిన్నంగా ఇప్పుడు మన శరీర బరువు తగ్గించుకోవాలి అంటే కష్టపడి జిమ్ములు చుట్టూ తిరగక్కరలేదని మనకు నచ్చిన చాక్లెట్స్ తింటే చాలు అని అంటున్నారు. అయితే ఈ వార్తలు ఏవో మీడియాలో వస్తున్నవి కావు.

బరువు తగ్గాలి అని అనుకునే వారి పై కొన్ని పాశ్చాత్య దేశాలలో జరిగిన లేటెస్ట్ అధ్యయనాలు. నమ్మడానికి ఈవార్తలు నమ్మశక్యంగా లేకపోయినా ఈవార్తలు నిజం అని అంటున్నాయి పాశ్చాత్య మీడియా వర్గాలు. సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.

నిత్యం 30 గ్రాముల క‌న్నాత‌క్కువ మోతాదులో చాక్లెట్ల‌ను తింటే దాంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. చాక్లెట్ల త‌యారీలో వాడే కోకో లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం పై ప్ర‌భావాన్ని చూపుతాయి. అంతేకాదు మెట‌బాలిజాన్ని పెంచుతాయి. దీనితో మనం పెద్దగా కష్టపడకుండానే క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌యి బ‌రువు త‌గ్గుతారు అని పరిశోధనలు చెపుతున్నాయి.

అయితే ఇలా జరగాలీ అంటే చాక్లెట్ల‌ను తక్కువ మోతాదులో తింటే మాత్ర‌మే ఇలా ఫ‌లితం ఉంటుంది ఈ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. కానీ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని రుచిగా ఉంటాయనీ ఎక్కువ‌గా ఈ చాక్లెట్లను తింటే బ‌రువు త‌గ్గ‌క‌పోగా పెరిగే ప్ర‌మాదం ఉంటుంద‌ని కూడా సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌మ ఆహార ప్ర‌ణాళిక‌లో చాక్లెట్ల‌ను నిర్భ‌యంగా చేర్చుకుని పరిమితంగా తినవచ్చు. ఈ పరిశోధనలు వాస్తవాలు అని తేలితే ఇక చాక్లెట్ల కంపెనీలకు రానున్న కాలం అంతా లాభాలే లాభాలు..   


మరింత సమాచారం తెలుసుకోండి: