మనకు ఉండే ఆహారపు అలవాట్లతో రకరకాల అనారోగ్యాలు వస్తాయి అన్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాత్రిపూట బాగా ఆలస్యంగా డిన్నర్ చేసేవారిలో టైప్ 2 డయాబెటిస్ గుండె జబ్బులు వస్తాయని ఇప్పటికే అనేక పరిశోధనలలో వెల్లడైంది. అందువల్లనే వైద్యులు రాత్రి సమయంలో వీలైనంత త్వరగా భోజనం చేయాలని సూచిస్తున్నారు.

భోజనం చేసాక కనీసం రెండు గంటల గ్యాప్ తో నిద్రకు ఉపక్రమించాలని దీనివల్ల చాలా అనారోగ్యాలు తప్పిపోతాయని అంటున్నారు వైద్యులు. అయితే ఇప్పుడు లేటెస్ట్ అధ్యయనంలో మరొక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆలస్యంగా భోజనం చేసేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని లేటెస్ట్ అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి. 

స్పెయిన్‌కు చెందిన పలువురు సైంటిస్టులు 872 మంది పురుషులు 1321 మంది స్త్రీలపై చేసిన అధ్యయనంలో వారి రోజువారీ ఆహారపు అలవాట్లు భోజనం చేసే సమయాలు నిద్రించే సమయం వారు ఉండే పనిచేసే వాతావరణం వారికున్న అనారోగ్య సమస్యలు తదితర సమాచారాన్ని సేకరించిన తరువాత కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రాత్రిపూట 9 గంటల తరువాత భోజనం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం ఈ అధ్యయనాలలో బయటపడింది. 

అలాగే 9లోపు భోజనం చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 26శాతం వరకు తక్కువగా ఉంటాయని అలా కాకుండా ఇంకా ముందే భోజనం చేస్తే ఆఅవకాశం 16శాతం వరకు తగ్గుతుందని ఈ అధ్యయనాలలో తేల్చారు. అందువల్ల రాత్రి పూట ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిన్నర్ ముగించేయాలని ఈ అధ్యయనం చేసిన వారు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ పరిశోధనకు సైంటిస్టులు ఎంచుకున్న వారిలో 621 మంది పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్, 1205 మంది మహిళలకు వక్షోజాల క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఈ అధ్యయనాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో ప్రచురించారు. దీనితో ఇలాంటి ప్రమాదాలు తప్పించుకోవాలి అంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే మార్గం..


మరింత సమాచారం తెలుసుకోండి: