థైరాయిడ్ గ్రంధులు సరిగ్గా పనిచేయకుంటే  జీవక్రియ హృదయ మరియు మానసిక ఆరోగ్యాలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి అంతేకాదు థైరాయిడ్ గ్రంధుల విషయంలో    అవకతవకలు తలెత్తితే మన శరీరంలో ఆక్సిజనేషన్ ప్రక్రియలు దెబ్బతింటాయి. దీనితో మన జీవిత నాణ్యతను ప్రభావితంచేసే ఈ థైరాయిడ్ గ్రంధులు సక్రమంగా పనిచేయడం చాలా అవసరం అని వైద్యులు చెపుతున్నారు.  

ఈ థైరాయిడ్ సమస్య వల్ల దీర్ఘకాలిక అలసట ఆందోళన భయము లైంగిక ఆసక్తి కోల్పోవడం చర్మం పొడిబారడం జుట్టు రాలడం ఆకలి మరియు ఆహార రుచిలో మార్పులు కండరాల మరియు కీళ్ళ నొప్పులు అధిక రక్తపోటు సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా ఆక్రుట్ ను తేనె మిశ్రమంతో తీసుకుంటే  థైరాయిడ్ గ్రంధులకు ఉద్దీపన చేసే ఒక ఔషధంగా ఉపయోగపడుతుందని లేటెస్ట్ అధ్యనాలు చెపుతున్నాయి. 
 
ఈ ఆక్రుట్ తేనెల మిశ్రం వల్ల థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉంటే దానిని క్రమబద్దం చేసుకోవచ్చు. అంతేకాదు థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును ప్రోత్సహించే పోషకాలు మరియు లక్షణాలు దీనిలో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఆక్రుట్ నట్స్ పెద్ద మొత్తంలో సెలీనియంను కలిగి ఉంటాయి. సెలీనియం థైరాయిడ్ యొక్క సరైన పనితీరుకు ఉపయోగపడే ఒక సూక్ష్మ మూలకం. ఇది హార్మోన్ల యొక్క సరైన విభజనను ప్రోత్సహిస్తుంది అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 

తేనెలో ఎంజైములు, ఖనిజాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో పేరుకున్న హానికరమైన పదార్ధాలను శుభ్రపరచడంలో ఈ తేనే  ఆక్రుట్ మిశ్రమం సహాయ పడుతుంది. సేంద్రీయ తేనెలో ఉండే ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు శరీర హార్మోన్ల ప్రక్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపధ్యంలో ఈ ఆక్రుట్ తేనెల మిశ్రమం థైరాయిడ్ కు వరప్రసాదం అని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: