స్నేహితుల దినోత్సవం నాడు తమ స్నేహాన్ని వ్యక్తపరచడానికి చాటిచెప్పడానికి స్నేహితులు ఎస్ఎంఎస్ ద్వారానో...గ్రీటింగ్స్ ద్వారానో తెలియ పరుస్తూ ఉంటారు. ఇటువంటి స్నేహితుల దినోత్సవం నాడు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం….ఇందులో భాగంగా మన చుట్టూ ఉన్న స్నేహితులతో మనపెలా ఉంటున్నామో ఒక్కసారైనా మననం చేసుకుంటున్నామా? నిజమైన స్నేహం నిలవాలంటే ఏమేం పాటించాలో తెలుసుకుంటున్నామా?...నిజమైన ఫ్రెండ్ షిప్ నిలవాలంటే కచ్చితంగా ఆ స్నేహితుడు కష్టాలను బాధలను అర్థం చేసుకొని వాటిని అధిగమించడానికి ప్రతి స్నేహితుడు తోడ్పడాలని చాలామంది అంటారు.
Image result for friendship
మనిషి జీవితంలో స్నేహితుడు అనేవాడు లేకపోతే అటువంటి వ్యక్తిని పూర్వం పెద్దలు ఏమన్నారంటే... “స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్‌ లేని ఎడారిలాంటిది”. మరోపక్క మంచి స్నేహితుడు కలిగిన వ్యక్తిని...కొండగుహలో పోల్చారు పెద్దలు.  దాని ముందు నిల్చొని అరిస్తే వ్రతిధ్వని వినివిస్తుంది. మంచి మిత్రుడి స్పందన కూడా అంత సహజంగా వేగంగా ఉంటుంది. 'నీ వెంట నేనున్నా' అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. అంతేకాకుండా నిజమైన స్నేహితుడు...ఓటమిలో ఓదార్చేవాడు; మన గెలువును తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేపాడు;
Image result for friendship
సమస్యల్లో ఓ కౌన్సిలర్‌గా ఉండేవాడు; ఏం చేయాలో తోచని స్థితిలో నీకండగా ఉన్నాననే ధైర్యాన్నిచ్చేపాడు'. ముఖ్యంగా బాల్యం నుండి స్మశానం కి వెళ్లే జీవిత ప్రయాణంలో మనిషి నివసించే నాలుగ్గోడల మధ్య తలెత్తే సమస్యలకు విరుగుడు స్నేహమని చాలామంది పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా స్నేహంలో మూడు దశలున్నాయని ఆడర్సన్‌ అనే మనస్తత్వపేత్త చెప్పాడు. మొదటి దశలో వ్యక్తిగత సంబరధం ఉండదు. కలిసి చేసే వనులవైనే ఆధారవడి ఉరటుంది. వదిహేను ఏళ్ల తర్వాత మొదలయ్యే రెండో దశ నమ్మకం పై ఆధారవడి ఉంటుంది.
Related image
ఆపై సోషల్‌ సపోర్ట్‌, భద్రత ముఖ్య పాత్ర వహిస్తాయి. జీవితంలో స్నేహం నిరంతరం కొనసాగించాలంటే చిన్న చిన్న విషయాలను వట్టించుకోకూడదు. విమర్శించి తవ్పులు సరిదద్దడం స్నేహంలో భాగమే కానీ అదపనిగా విమర్శలు చేయకూడదు. విమర్శ మనసులో ముల్లులా గుచ్చుకోకుండా, చెవ్పే మాటలు సున్నితంగా ఉండేలా జాగ్రత్త వడాలి. ఒక స్నేహితుడిలోని లోపాలను మరో స్నేహితుడి వద్ద వ్రస్తావించకుండా ఉంటేనే మంచిది. అలాగే స్నేహాన్ని వస్తువులతో గాని స్థాయిలతో గాని పోల్చుకోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా స్నేహితుడి మీద అతని పండుగ మీద అనుమానించే టట్లు ప్రవర్తించకూడదు. స్నేహం నిరంతరం కొనసాగించే టట్లు కష్టాలలో భాగాలలో కూడా స్నేహితుడు వెంటే ఉంటూ ముందుకు సాగాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: