మానవ జీవితం యాంత్రికమైన నేపధ్యంలో మన ఆహార నియమాల పై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో ప్రతి వ్యక్తికి అనేక అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది గ్యాస్ సమస్య. ఈ సమస్యతో అనేకమంది సతమతమవుతున్న నేపధ్యంలో ఈ సమస్యకు నేచురల్ రెమిడీస్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో నిరంతర అన్వేషణ జరుగుతోంది. 

చాలామందికి భోజనం చేయగానే తీవ్రమైన గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడమే కాకుండా మరో విధంగా త్రేన్పులు రావడమో మరో విధంగా గాలి బయటకు వెళ్లడమో జరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుండి బయట పడవచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. 

భోజనం చేసేటప్పుడు వీలైనంత వరకు ద్రవాలను తక్కువగా తీసుకోవాలని లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ చేరుతుందని చెపుతున్నారు. భోజనం చేయక ముందు చేశాక కనీసం 20 నిమిషాల గ్యాప్ ఉండేలా ద్రవాలను తీసుకునే విషయంలో నియంత్రణ పాటించి నీరు త్రాగాలని లేదంటే గ్యాస్ సమస్య వచ్చి తీరుతుందని అంటున్నారు. దీనికితోడు చాలా మంది ఆహారాన్ని త్వరగా తినేస్తారు సరిగ్గా నమలరు. అలా చేయడం వల్ల కూడ గ్యాస్ వస్తుందని చెపుతున్నారు.  

ముఖ్యంగా భోజనం చేశాక కొంతసేపు వాకింగ్ చేసిన వారికి కొంత వరకు ఈగ్యాస్ సమస్య రాదు అన్న పరిశోధనలు ఉన్నాయి. రోజూనిర్ణీత సమయంలో వ్యాయామం చేస్తే కూడ గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. నిత్యం తినే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలని ఉప్పు వల్ల జీర్ణాశయంలో నీరు ఎక్కువగా చేరి. ఇది గ్యాస్ సమస్యను సృష్టిస్తుందని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. దీనికితోడు శీతల పానీయాలు సోడాలు ఎక్కువగా తీసుకునే వారికి ఈ గ్యాస్ సమస్య అనేక సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా నిత్యం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకునే వారికి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి దానివల్ల గ్యాస్ సమస్యలు తీరతాయి. ఈ నేపధ్యంలో బొప్పాయి పైనాపిల్ పండ్లను ఎక్కువగా తింటే గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది అని అధ్యనాలు చెపుతున్నాయి. వీటిల్లో ఉండే సహజసిద్ధమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఈ నేచురల్ రెమిడీస్ ను పాటిస్తే కొంత వరకు అయినా గ్యాస్ సమస్య ఉన్నవారు బయటపడవచ్చు..  


మరింత సమాచారం తెలుసుకోండి: