మామిడికాయలు అన్ని కాలాలలోనూ లభించే పరిస్థుతులు ఏర్పడటంతో అనేక పదార్ధాల తయారీలో మామిడికాయలను వాడటం జరుగుతోంది. మామిడిపండ్లను అదేవిధంగా మామిడి కాయలను ఉపయోగించేవారు అందులోని టెంకను నిరుపయోగంగా భావిస్తూ బయట పడేయటం జరుగుతుంది. 

అయితే లేటెస్ట్ అధ్యయనాలు మాత్రం ఈ మామిడి టెంక వల్ల కూడ అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెపుతున్నాయి. మామిడి టెంకను పొడి చేసుకొని, జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి దాన్ని వేడి వేడి అన్నంలో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది. 

అంతేకాదు ఉదరసంబంధ వ్యాధులకు మామిడి టెంక మంచి ఔషధంగా ప‌నిచేస్తుంది. గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం ఈ మామిడి టెంక పౌడరు వల్ల త‌గ్గుతాయి అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.  ముఖ్యంగా మామిడి టెంక పొడిని మజ్జిగలో కలిపి కాస్త ఉప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.

మామిడి టెంక చూర్ణాన్ని రోజుకి 3 గ్రాముల‌ చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గడమే కాకుండా దగ్గు గొంతు స‌మ‌స్య‌లు తొలిగిపోతాయి. టెంక‌లో ఉండే జీడిని పొడి చేసి మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుందని కొందరు బ్యూటీషియన్స్ కూడ చెపుతున్నారు. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి రాస్తే చర్మం. చ‌ర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది అన్న అధ్యయనాలు కూడ ఉన్నాయి. దీనితో మామిడి కాయలను పండ్లగా మార్చి రుచిగా తినడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: