చాలామంది దొండకాయలను కూరగా పచ్చడిగా చేసుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే కేవలం దొండకాయలతోనే కాకుండా దొండ ఆకుల వల్ల కూడ అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి అంటూ లేటెస్ట్ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. ఇందులో ఉన్న నిజాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

దొండ ఆకులు లేదా దొండ తీగ రసాన్ని నిత్యం 20 నుంచి 30 గ్రాముల మోతాదులో 40 నుంచి 80 రోజుల పాటు సేవిస్తే మధుమేహం పూర్తిగా అదుపులోకి వస్తుందని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దీనితో మధుమేహంతో సతమతమవుతున్న వారు ఈ చిట్కా పాటిస్తే చాలు వారి సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.

దొండ ఆకులు నల్ల ఉమ్మెత్త ఆకులు చిక్కుడు ఆకులను సమానంగా తీసుకుని దంచి వాటినుంచి వచ్చే రసాన్ని తీసి అరికాళ్లకు వ్రాసుకుంటే దానివల్ల అరికాళ్ళలో వచ్చే మంటలు తగ్గుతాయి. అంతేకాదు దొండ ఆకుల నుంచి తీసిన రసం, ఆవాల పొడి, వెల్లుల్లి రసం మూడింటినీ సమపాళ్లలో తీసుకుని కలిపి 3 గ్రాముల మోతాదులో మెత్తని ఉండల్లా చేసి రోజుకు మూడు పూటలా ఒక్కో ఉండను నీటితో తీసుకుంటే మహిళలకు వచ్చే గైనిక్ సమస్యలు తగ్గుతాయి.

దొండ ఆకుల నుంచి తీసిన రసాన్ని గేదె పెరుగులో కలిపి నిత్యం తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి అన్న పరిశోధనలు కూడ ఉన్నాయి. ఇలా ఎన్నో రకరకాల ప్రయోజనాలు ఈ దొండ ఆకులలో ఉండటం వల్ల ఈ రసాన్ని క్రమం తప్పకుండ తీసుకోవడం అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది అని అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: