ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి అసౌకర్యంగా మారుతున్న సమస్య మలబద్ధకం. ప్రతి వ్యాధికి వివిధ కారణాలు ఉంటాయి అయితే మలబద్ధకం ఎందుకు ఏర్పడుతుంది అన్న విషయమై అనేక అధ్యయనాలలో కూడ సరైన కారణాలు అంతుబట్టడం లేదు. 

మన ఆహారపు అలవాట్లతో పాటు మానసిక ఒత్తిడి కూడ ఈ మలబద్దకానికి కారణం అవుతోంది అంటూ అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి ఎంతో మంది లేక్సేటివ్ ఔషధాలను వినియోగిస్తున్నా దాని వలన సరైన ఫలితాలు రావడం లేదని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. 

మలబద్దక సమస్యకు ఓట్స్ అద్భుతంగా సహాయ పడతుందని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఈ ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో మలబద్ధక సమస్యల వల్ల ఏర్పడే   కడుపు నొప్పి, వికారం, తరచూ మూత్రవిసర్జన, పురీషనాళంలో నొప్పి, ఆకలిలో హెచ్చు తగ్గులు వంటి సమస్యలకు ఈ ఓట్స్ ఒక ఔషదంలా పనిచేస్తుందని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. 

మలబద్ధక సమస్య సంవత్సరాల తరబడి ఉండిపోతే ఈ సమస్య వల్ల పేగు క్యాన్సర్లకు దారితీసే ఆస్కారం ఉండటంతో ఈ సమస్య పట్ల సరైన శ్రద్ధ పట్టడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.  ముఖ్యంగా ఓట్స్ లో కరగని పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఈ మలబద్ద సమస్యకు అత్యుత్తమంగా ఈ ఓట్స్ ఎంతో సహకరిస్తాయని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: