అపారమైన ఔషధ గుణాలతో పాటు ఎ,బి,సి,డి,ఇ వంటి అత్యంత కీలకమైన విటమిన్లు కలబందలో పుష్కలంగా  ఉండటంతో కలబంద వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాల పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులోని  లిపాసెస్‌ అనే ఎంజైము శరీరంలోని కొవ్వును చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  అదేవిధంగా ఇందులో ఉండే ప్రొటెనెస్‌ అనే ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బ్రాడికీనెస్‌ అనే ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతో పాటు చర్మాన్ని మృధువుగా మారుస్తుంది. 

కలబందలో జీర్ణశక్తికి కావలసిన లవణాలను క్రమబద్ధంగా అందించే ఎలిమెంట్లు కూడా కావలసినంతగా ఉన్నాయి అని పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. కలబందలో ఉండే సలిసైలిక్‌ యాసిడ్‌ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంప్లిమెంటరీ. ఇది రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల పలురకాల చర్మ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కలబందలో 12 రకాల క్రిమినాసికాలు ఉంటాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలను నివారించడంతోపాటు నొప్పులను తగ్గిస్తాయి. 

ఇక ముఖ్యంగా  కలబందలోని సపోనిన్స్‌ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను,నాశనం చేయడంలో కలబంద ఎంతగానో సహకరిస్తుంది. మన  శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలో ఉన్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. దీని ద్వారా దీర్ఘకాలిక మలబ్ధకం, ఎసిడిటిసమస్యలు చాలా సులువుగా తగ్గించుకోవచ్చు. 

ముఖ్యంగా మధుమేహం, లివర్‌ సమస్యలు,  గాస్ , ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, రక్తహీనత, అధిక బరువు  వంటి సమస్యలకు కూడా కలబంద ఒక సరైన పరిష్కారం.   కలబందను తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ చక్కబడడంతో పాటు శరీరంలోని వ్యర్థ విషపదార్థాలు సక్రమంగా విసర్జించబడతాయి. దీనితో విటమిన్ల కలబొతగా కలబందను గుర్తిస్తున్నారు.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: