రుచి కోసం బ‌ఠానీల‌ను మ‌నం అనేక ర‌కాల కూర‌ల్లో వేస్తుంటాం. అయితే వీటిని కేవలం రుచికోసం కాకుండా వీటి వాడకం వల్ల కలిగిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవుతారు. మలబద్దకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూర‌గా చేసుకుని తింటే విరేచనం సాఫీగా జరుగుతుంది. 

బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. బరువు కూడా పెరగకుండా ఉంటారు. పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని లేటెస్ట్ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.  డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇవి బాగా పనిచేస్తాయి. 

అదేవిధంగా గుండె జబ్బులు రాకుండా చేయడమే కాకుండా రక్తనాళాలను సంరక్షించడంలో ఈపచ్చి బఠానీలు ఎంతగానో ఉపకరిస్తాయి. దీనికితోడు విటమిన్ కె వీటిలో సమృద్ధిగా ఉండటంతో పాటు శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను నాశనం చేయడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చి బఠానీలను ప్రతిరోజు అన్నిటిలో వినియోగించుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని వైద్యుల సలహా ఇస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: