సాధారణంగా వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వెల్లుల్లి ఆహారానికి రుచి   సువాసన మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగ పడుతుందని అనేక పరిశోధనలు తెలియ చేస్తున్నాయి. ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని కలిగించే లక్షణాలతో  అనేక  పోషక  విలువలు కలిగి ఉన్నాయి. 

గుండె జబ్బు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో ల్లుల్లి కీలక పాత్ర  పోషిస్తుంది. అంతేకాకుండా ఊబకాయం తగ్గించడంలో అదే విధంగా బరువును కోల్పోవడంలో కూడా వెల్లుల్లి ఎంతగానో సహకరిస్తుంది. వెల్లుల్లి,లో  విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం, పాస్ఫరస్, క్యాల్షియం, ఐరన్, మరియు రాగి వంటి ఖనిజాలు ఉండటంతో కనీసం  రోజువారీ ఆహార ప్రణాళికలో నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం మంచిదని వైద్యులు చెపుతున్నారు. 

ముఖ్యంగా జీర్ణ మరియు జీవ క్రియలు చక్కగాకొనసాగడానికి పరగడుపునే వెల్లుల్లిని తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఒక కొరియన్ అధ్యయన పరిశోధనల ప్రకారం శరీర బరువు  తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదని తెలుస్తోంది. 2011లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన అధ్యయనంలో శరీరంలోని కొవ్వుతో వెల్లుల్లికి గల సంబంధానికి గురించిన అనేక ఆసక్తికర విషయాలు తెలియచేయబడ్డాయి.

వంటకు ఉపక్రమించే ముందు తాజా వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి తరువాత వినియోగించడం మూలముగా శరీర బరువు తగ్గడంలో ఉత్తమ ప్రయోజనాలను పొందవచ్చని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక చురుకైన సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి నుండి వచ్చే ఘాటైన వాసనకు ఇదే కారణం. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో వెల్లుల్లి పోషించే పాత్ర అత్యంత కీలకం. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లిని ప్రతి వంటాయకలలోము కలపడం మంచిదని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: