వంకాయ కూరని ఇష్టపడని తెలుగువాడు ఉండడు. కేవలం కూరలలోనే కాకుండా రకరకాల వంటల తయారీలో వంకాలను ఉపయోగిస్తారు. అయితే అద్భుతమైన రుచికి మాత్రమే కాదు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ వంకాయలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి అని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.  

వంకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలతో పాటు ఆంథోసయనిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. దీనితో మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. చురుగ్గా పనిచేయగలిగి తద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. 

ఈ వంకాయలలో ఉండే విత్తనాలు తినడం వల్ల మన శరీర జీర్ణ వ్యవస్థ మూత్రాశయ వ్యవస్థ చక్కగా పనిచేస్తాయని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. వంకాయల్లో పాస్ఫరస్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6, ప్రోటీన్లు, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, ఫోలేట్, విటమిన్ కె తదితర అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి. 

ఇక లేటెస్ట్ గా వంకాయలను తరచూ తినడం వలన మన శరీర కొలెస్ట్రాల్ శాతం తగ్గు ముఖం పట్టడమే కాకుండా మధుమేహం అదుపులోకి వస్తుంది అని కొందరు వైద్యులు చెపుతున్నారు. అదేవిధంగా శరీర అధిక బరువును తగ్గించేందుకు కూడా వంకాయలు మేలు చేస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాకరమైన వ్యాధుల బారి నుంచి రక్షించే గుణాలు వంకాయల్లో ఉంటాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ వంకాయలలో ఉండటం వల్ల వీటిని తరుచు మనం చేసే భోజనంలో రకరకాల కూరగా చేసుకుని తినడం మంచిదని డైటీషియన్స్ కూడ చెపుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: